Quad Summit: క్వాడ్ సమ్మిట్ కోసం జపాన్ బయలుదేరిన ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడితో భేటీ..

Quad Summit: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం జపాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో క్వాడ్ అలయన్స్ రెండో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు.

Quad Summit: క్వాడ్ సమ్మిట్ కోసం జపాన్ బయలుదేరిన ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడితో భేటీ..
Pm Modi
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 22, 2022 | 9:52 PM

Quad Summit: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం జపాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో క్వాడ్ అలయన్స్ రెండో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ గ్రూపులో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ పర్యటనలో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరగనున్నాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఇచ్చిన ఆహ్వానం మేరకు తాను జపాన్ వెళ్తున్నట్లు ఆదివారం ప్రధాని మోదీ తెలిపారు.

దాదాపు 40 గంటల పాటు జపాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఉండనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మొత్తం 23 కార్యక్రమాలకు హాజరవుతారు. దీనికి తోడు ముఖ్యమైన సమావేశాలను నిర్వహించనున్నారు. దీనితో పాటు జపాన్‌కు చెందిన 35 మంది ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ సమయంలో, జపాన్ కంపెనీల CEOలు, అధ్యక్షులు కూడా అక్కడ ఉంటారు.

ప్రధాని మోదీ ఓ ప్రకటన విడుదల చేశారు..

ఇవి కూడా చదవండి

ఆదివారం ప్రధాని మోదీ తన జపాన్ పర్యటనకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. జపాన్‌లో క్వాడ్ లీడర్‌ల మధ్య ఇది ​​రెండవ వన్-టు వన్ సమ్మిట్ అని ఆయన చెప్పారు. ఈ డైలాగ్ ద్వారా క్వాడ్ గ్రూప్ చేసిన ప్రయత్నాలను సమీక్షించేందుకు జపాన్, భారత్, ఆస్ట్రేలియా, అమెరికాలకు మంచి అవకాశం లభిస్తుంది.

ఆస్ట్రేలియా కొత్త ప్రధాని తొలిసారిగా..

పీఎం మోడీ, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశానికి మొదటిసారి హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సమావేశం గురించి తాను సంతోషిస్తున్నానని ఆయన చెప్పారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సహకారంతో పాటు, వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు కూడా చర్చించనున్నారు.

చైనా లక్ష్యాన్ని చేధించింది..

చైనా కూడా క్వాడ్ సదస్సును టార్గెట్ చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు, అభివృద్ధి కోసం ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు క్వాడ్ నేతలు చెబుతున్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ నేతల సమావేశానికి ముందు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. అమెరికా, జపాన్‌లను టార్గెట్ చేశారు. బీజింగ్‌పై ఇరు దేశాలు ప్రతికూల చర్యలు తీసుకుంటున్నాయని చైనా విదేశాంగ మంత్రి ఆరోపించారు. అదే సమయంలో.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పర్యవేక్షణలో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలకు చెందిన క్వాడ్ గ్రూప్‌ను నాయకత్వ స్థాయికి తీసుకువెళ్లిందని అమెరికా ఇటీవల పేర్కొంది.