AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boy In Bore Well: బోరుబావిలో పడ్డ బాలుడి మృతి.. 8 గంటల పాటు కొనసాగిన సహాయకచర్యలు.. దుఖసాగరంలో హృతిక్‌ రోషన్‌ తల్లిదండ్రులు..

Punjab Rescue Operation: అభంశుభం తెలియని బాలుడిని బోరుబావి మింగింది. పంజాబ్‌ లోని బులాందా గ్రామంలో బోరుబావిలో పడ్డ ఆరేళ్ల హృతిక్‌ రోషన్‌ చనిపోయాడు. 8 గంటల పాటు సహాయక బృందాలు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది.

Boy In Bore Well: బోరుబావిలో పడ్డ బాలుడి మృతి.. 8 గంటల పాటు కొనసాగిన సహాయకచర్యలు.. దుఖసాగరంలో హృతిక్‌ రోషన్‌ తల్లిదండ్రులు..
Borewell
Sanjay Kasula
|

Updated on: May 22, 2022 | 9:35 PM

Share

బోరుబావి మరో పసిబాలుడి ప్రాణాలను మింగింది. పంజాబ్‌ లోని హోషియార్‌పూర్‌ జిల్లా బులాందా గ్రామంలో బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 8 గంటల పాటు హృతిక్‌ రోషన్‌ అనే బాలుడిని బోరుబావి నుంచి రక్షించినప్పటికి ప్రాణాలు దక్కలేదు. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు హృతిక్‌ రోషన్‌. ఈ ఘటనపై పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  బాలుడు పడ్డ బోరుబావిని సిమెంట్‌ సంచి కప్పి వదిలేశారు . పొలంలో ఆడుకుంటున్న హృతిక్‌ను రుతిక్‌ ‌ను వీధికుక్కలు వెంబడించాయి. కుక్కల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బోరుబావి పైప్‌ ఎక్కాడు హృతిక్‌ . సిమెంట్‌ సంచితో పాటు అతడు బోరుబావిలో పడిపోయాడు. తొలుతు బాలుడిని కాపాడేందుకు స్థానికులు చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ బృందంతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

హృతిక్‌ రోషన్‌ పడ్డ బోరుబావి లోతు 300 అడుగులు. 100 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నాడు బోరుబావి లోకి ఆక్సిజన్‌ కూడా పంపించారు. అయినప్పటికి ఫలితం లేకుండా పోయింది. బోరుబావికి సమాంతరంగా భూమిని తవ్వి హృతిక్‌ను ను బయటకు తీశారు. ప్రాథమిక చికిత్స తరువాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందించే లోపే హృతిక్‌ కన్నుమూశాడు. హృతిక్‌రోషన్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వలసకూలీలుగా పనిచేస్తున్న వాళ్లకు పుత్రశోకం మిగిలింది.