Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Ration: కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ పథకాన్ని నిలిపివేస్తుందా ? అందుకేనా ఈ నిర్ణయం

పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంపిణీ చేయడానికి ప్రభుత్వం వద్ద చాలా పరిమితమైన ఆహార ధాన్యాలు మిగిలి ఉన్నాయని తెలుస్తుంది.

Free Ration: కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ పథకాన్ని నిలిపివేస్తుందా ? అందుకేనా ఈ నిర్ణయం
Free Ration Scheme
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 14, 2022 | 2:51 PM

కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ పథకాన్ని నిలిపివేస్తుందా ? అతిత్వరలో దీనిపై కీలక నిర్ణయం వెల్లడిస్తుందా ? జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర చాలా పరిమితమైన ఆహారధాన్యాల స్టాక్‌ మిగిలి ఉంది. అందుకే ఉచిత రేషన్ పథకాన్ని ఆపేయాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో అధిక ద్రవ్యోల్బణం కారణంగా తన దగ్గర ఉన్న ఆహార ధాన్యాల స్టాక్‌ను బహిరంగ మార్కెట్‌ లోకి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

బహిరంగ మార్కెట్‌లో గోధుమ ధర 13 శాతానికి పైగా పెరిగింది. రెండు నెలల క్రితం ఢిల్లీలో గోధుమ ధర క్వింటాల్‌కు దాదాపు 2,560 రూపాయలు. ఇప్పుడు ధర 2,900 రూపాయలకు పైనే ఉంది. ఈ అధిక గోధుమ ద్రవ్యోల్బణం గోధుమ పిండి ధరలను కూడా పెరిగేలా చేసింది. గోధుమ ద్రవ్యల్బణాన్ని తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టబోతోంది కేంద్రం. ప్రభుత్వం తన స్టాక్ నుండి 20-30 లక్షల టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వ గోదాములో నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే దాని స్టాక్ మరింత క్షీణిస్తుంది.

నవంబర్ 1వ తేదీన ప్రభుత్వ గోదాములో మొత్తం గోధుమ నిల్వ 210 లక్షల టన్నులు. గతేడాదితో పోలిస్తే ఇది 50 శాతం తక్కువ. 14 ఏళ్లలో నవంబర్ ప్రారంభంలో ఇదే అత్యల్ప స్టాక్. గోధుమల ద్రవ్యోల్బణం మరియు సరఫరాకు సంబంధించిన ఈ గణాంకాలు, ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీకి చాలా పెద్ద అడ్డంకిగా మారాయి.

బియ్యిం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రభుత్వ గోదాముల్లో బియ్యం స్టాక్ కూడా 4 సంవత్సరాల కనిష్టంగా ఉంది. గత కొద్దిరోజులుగా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లను పెంచింది, అయితే ప్రభుత్వం ఉచిత రేషన్ పథకానికి బియ్యం సరఫరాను పెంచే పరిస్థితి కన్పించడం లేదు. గుజరాత్, హిమాచల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈనెల వరకు ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..