Mobile, Internet charges: పెరగనున్న మొబైల్, ఇంటర్‌నెట్‌ ఛార్జీలు ? ఆదాయం పెంచుకునేందుకు సన్నాహాలు

Mobile, Internet charges: కస్టమర్లకు మరో భారం కానుంది. ఇంటర్‌నెట్‌, ఫోన్‌ కాల్స్‌ ఛార్జీలు భారీగా పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టెలికం..

Mobile, Internet charges: పెరగనున్న మొబైల్, ఇంటర్‌నెట్‌ ఛార్జీలు ? ఆదాయం పెంచుకునేందుకు సన్నాహాలు
Follow us

|

Updated on: Feb 18, 2021 | 6:05 PM

Mobile, Internet charges: కస్టమర్లకు మరో భారం కానుంది. ఇంటర్‌నెట్‌, ఫోన్‌ కాల్స్‌ ఛార్జీలు భారీగా పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టెలికం కంపెనీలు టారిఫ్‌ ధరలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జియో రాకతో టెలికం కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో టారిఫ్‌ ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజన్సీ (ఐసీఆర్‌) ప్రకారం.. దాదాపు అన్ని టెలికం కంపెనీలులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దాదాపు అన్ని కంపెనీలు కూడా ఇటు ఇంటర్‌నెట్‌తో పాటు వాయిస్‌ కాల్స్‌ ధరలను కూడా తగ్గించేశాయి. ఇక తాజాగా ఏప్రిల్‌ నుంచి టెలికం సంస్థలు ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా టెలికం కంపెనీలు 5జీలోకి అడుగు పెట్టడానికి ముమ్మర ప్రయత్నాలు సైతం చేస్తున్నాయని, ఈ క్రమంలోనే నిధుల కోసం ధరలను పెంచేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ధరలు ఎంత మేర పెరగనున్నాయి అనే విషయం తెలియాల్సి ఉంది. టారిఫ్‌ పెంచడం, వినియోగదారులు 2జీ నుంచి 4జీకి మారడం ద్వారా రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని ఐసీఆర్ఏ భావిస్తోంది. అయితే ఈ విషయమై స్పష్టత కోసం మరిన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Also Read: WhatsApp New Features: వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త.. త్వరలో రాబోయే కొత్త ఫీచర్లు ఇవే..!