viral video : ఈ సర్పంచ్ గారి రూటే సెపరేటు.. ప్రమాణ స్వీకారానికి ఏకంగా హెలికాఫ్టర్ లో వచ్చాడు..
రాజకీయ నాయకులూ ప్రమాణ స్వీకారానికి భారీ బైకు ర్యాలీగా వెళ్లడం మనం చూసాం... కారులతో ర్యాలీగా వెళ్లడం చూసాం. కొంతమంది ఎదులబండి మీద, మరికొంతమంది..
viral video : రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారానికి భారీ బైకు ర్యాలీగా వెళ్లడం మనం చూసాం… కారులతో ర్యాలీగా వెళ్లడం కూడా చూసాం. కొంతమంది ఎదులబండి మీద, మరికొంతమంది పాదయాత్రలు చేసుకుంటూ కూడా వచ్చి ప్రమాణస్వీకారం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా హెలికాఫ్టర్ ఎక్కిమరి వచ్చి ప్రమాణస్వీకారం చేసాడు. అలాగని ఆయన ఏ స్పీకరో.. మినిస్టరో.. కనీసం ఎమ్మెల్యే నో కాదు ఒక సర్పంచ్.. అతడు గెలిచింది ఓ గ్రామ సర్పంచ్‌గా మాత్రమే.. సర్పంచ్‌గా గెలిచి.. హెలికాప్టర్‌లో ప్రమాణస్వీకారానికి ఎంట్రీ ఇచ్చాడు.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ తాలూకాలో ఉన్న అంబి – డుమాలా గ్రామానికి సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. గత నెలలో ఈ ఎన్నికలను నిర్వహించారు. సర్పంచ్ గా పారిశ్రామికవేత్త జలీందర్ గగారే పోటీ చేశారు. అతనితో పాటు..తన 9 మంది సభ్యుల ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. వ్యాపార పనులు చూసుకుంటున్నప్పటికీ ఇతను ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. పూణేలో ఉంటున్న తన ఇంటి నుంచి నేరుగా ఆ గ్రామానికి వెళ్లడానికి ఏకంగా హెలికాప్టర్ ను బుక్ చేసుకున్నాడు. హెలికాప్టర్ లో వచ్చిన అతడిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇతడికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. విజయ తిలకం దిద్దిన అనంతరం హెలిప్యాడ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయానికి 12 ఎద్దుల బండ్ల మీద ఊరేగింపుగా తీసుకెళ్లారు. తన స్వగ్రామం..సన్నిహితులతో సంబంధాన్ని తాను తెంచుకోవాలని అనిపించడం లేదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందని జలీందర్ వెల్లడించారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఇక ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు యావత్ దేశం మొత్తం తెగ వైరల్ అవుతుంది.