WhatsApp New Features: వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త.. త్వరలో రాబోయే కొత్త ఫీచర్లు ఇవే..!

WhatsApp New Features: వాట్సాప్‌.. ప్రతి ఫోన్‌లో ఇది ఉండాల్సిందే. వాట్సాప్‌ లేనిది ఈ రోజుల్లో ఎవ్వరు ఉండరు. కోట్లాది మంది రోజు ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌..

WhatsApp New Features: వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త.. త్వరలో రాబోయే కొత్త ఫీచర్లు ఇవే..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 18, 2021 | 5:25 PM

WhatsApp New Features: వాట్సాప్‌.. ప్రతి ఫోన్‌లో ఇది ఉండాల్సిందే. వాట్సాప్‌ లేనిది ఈ రోజుల్లో ఎవ్వరు ఉండరు. కోట్లాది మంది రోజు ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌. ఇటీవల ప్రైవసీ విషయంలో వాట్సాప్‌ నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ వివాదం పక్కనబెడితే యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందించేందుకు నిత్యం పని చేస్తోంది వాట్సాప్‌. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు వందలాది కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్‌ ఏ ఫీచర్‌ రూపొందించినా ముందుగా బీటా యూజర్లు పరీక్షలు నిర్వహిస్తారు. ఏవైనా లోపాలు ఉంటే సరి చేసి ఫీచర్‌ను మెరుగుపరుస్తుంది వాట్సాప్‌ సంస్థ. అయితే రాబోయే ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం.

WhatsApp Web- వాట్సాప్‌ వెబ్‌ లాగిన్‌

ప్రస్తుతం వాట్సాప్‌ను కంప్యూటర్‌లో లాగిన్‌ కావాలంటే మొబైల్‌ దగ్గర ఉండాలి. ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తేనే లాగిన్‌ చేయడం సాధ్యం అవుతుంది. ఇకపై ఫోన్‌ అవసరం లేకుండానే వాట్సాప్‌లో లాగిన్‌ కావచ్చు.

WhatsApp Multi-device – వాట్సాప్‌ మల్టీ డివైజ్‌

వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ ఫీచర్‌ వస్తే వాట్సాప్‌ను వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకే వాట్సాప్‌ ఖాతాను స్మార్ట్‌ ఫోన్‌లో, కంప్యూటర్‌లో, ట్యాబ్లెట్‌లో లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ డివైజ్‌ నుంచి మెసేజ్‌, ఫైల్స్‌ పంపినా అన్ని డివైజ్‌లలో సింక్‌ అవుతుంది.

WhatsApp Calls – వాట్సాప్‌ కాల్‌

స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. కానీ వాట్సాప్‌ వెబ్‌ ద్వారా ఈ అవకాశం లేదు. త్వరలో వాట్సాప్‌ వెబ్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్ చేసే ఫీచర్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

WhatsApp Mute videos – వాట్సాప్‌ మ్యూట్‌ వీడియో ఫీచర్‌

వాట్సాప్‌ మ్యూట్‌ వీడియో ఫీచర్‌ను బీటా యూజర్లు పరీక్ష చేస్తున్నారు. వాట్సాప్‌లో ఏదైనా వీడియో షేర్‌ చేసే సమయంలో ఆడియో మ్యూట్‌ చేసి పంపవచ్చు. అవతలివారికి వీడియో కనిపిస్తుంది తప్ప ఆడియో వినిపించదు.

Also Read: Facebook: దూకుడుగా వ్యవహరిస్తున్న ఫేస్‌బుక్‌.. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ..