AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష.. ఏకంగా ఎమ్మెల్యే పదవికే ఎసరు!

ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ దోషిగా తేల్చింది మౌ జిల్లా సెషన్స్ కోర్టు. అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. మాఫియా లీడర్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు, మౌ సదర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ రెచ్చిగొట్టే వ్యా్ఖ్యలతో ద్వేషపూరిత ప్రసంగం కేసులో మౌ జిల్లా సెషన్స్ కోర్టులో తీర్పు వెలువడనుంది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష.. ఏకంగా ఎమ్మెల్యే పదవికే ఎసరు!
Abbas Ansari
Balaraju Goud
|

Updated on: May 31, 2025 | 3:36 PM

Share

ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ దోషిగా తేల్చింది మౌ జిల్లా సెషన్స్ కోర్టు. అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. మాఫియా లీడర్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు, మౌ సదర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ రెచ్చిగొట్టే వ్యా్ఖ్యలతో ద్వేషపూరిత ప్రసంగం కేసులో మౌ జిల్లా సెషన్స్ కోర్టులో తీర్పు వెలువడనుంది. కోర్టు తీర్పుతో అబ్బాస్ అన్సారీ ఇప్పుడు శాసనసభ సభ్యత్వాన్ని కూడా కోల్పోతారని స్పష్టమవుతోంది. న్యాయమూర్తి డాక్టర్ కె.పి. సింగ్, చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, ఎంపీ ఎమ్మెల్యే కోట్ శిక్షను ప్రకటించారు.

2022 సంవత్సరంలో, ఎన్నికల సమయంలో ద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో అబ్బాస్ అన్సారీ, ఉమర్ అన్సారీలపై కొత్వాలిలో కేసు నమోదైంది. అబ్బాస్, ఉమర్ గట్టి భద్రత మధ్య MP, MLA కోర్టులో హాజరయ్యారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కోర్టు ప్రాంగణం చుట్టూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, CJM డాక్టర్ కె.పి. సింగ్ తీర్పు వెలువరించారు.

అసలు విషయం ఏమిటి?

ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీపై 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో, మౌలోని పహద్‌పురా ప్రాంతంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో అబ్బాస్ అన్సారీ వివాదాస్పద ప్రకటన చేశాడని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాతాలు పరిష్కరించాలని అధికారులను బెదిరించాడని, దీనిని ద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించారని ఆరోపించారు. ఈ ప్రసంగానికి సంబంధించి సబ్-ఇన్‌స్పెక్టర్ గంగారామ్ బింద్ మౌ కొత్వాలిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు 3 సంవత్సరాలు కొనసాగిన విచారణ తర్వాత ఈ కేసులో తీర్పు ఇవాల వచ్చింది.

మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారీ 2 నెలల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. సుప్రీంకోర్టు నుండి గ్యాంగ్‌స్టర్ చట్టం కింద మధ్యంతర బెయిల్ పొందిన తర్వాత అతను బయటకు వచ్చాడు. అబ్బాస్ అన్సారీపై నేర కార్యకలాపాలు, అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ అతనిపై దర్యాప్తు చేసి మనీలాండరింగ్, గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో అతను నవంబర్ 2022 నుండి జైలులో ఉన్నాడు. ఇప్పుడు మరో కేసులో తీర్పు తర్వాత, అతను జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.