MK Stalin – Jagdeep Dhankhar: సీఎం స్టాలిన్, బెంగాల్ గవర్నర్ మధ్య ట్విట్ వార్.. అసలేమైందంటే..?

MK Stalin - Jagdeep Dhankhar: జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ (CM KCR) చేసిన రాజ్యాంగ మార్పు కామెంట్స్‌ దేశవ్యాప్తంగా

MK Stalin - Jagdeep Dhankhar: సీఎం స్టాలిన్, బెంగాల్ గవర్నర్ మధ్య ట్విట్ వార్.. అసలేమైందంటే..?
Mk Stalin
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2022 | 8:36 AM

MK Stalin – Jagdeep Dhankhar: జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ (CM KCR) చేసిన రాజ్యాంగ మార్పు కామెంట్స్‌ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే కొందరు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ట్రాల గవర్నర్ల తీరు వివాదాస్పదంగా మారిందనే చర్చ జరుగుతోంది. తాజాగాప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ (mamata banerjee) త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఫోన్ చేయడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీయేత‌ర పార్టీల పాలిత రాష్ట్రాల్లో గ‌వ‌ర్నర్ల అధికార దుర్వినియోగంపై మమతా బెనర్జీ ఆందోళ‌న వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల విప‌క్ష నేత‌ల మ‌ధ్య చ‌ర్చలు జ‌రగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయప‌డ్డారు మమత. త్వర‌లో ప్రతిప‌క్ష పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో స‌ద‌స్సు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఎంకే స్టాలిన్. తాజాగా ఇలాంటి ఇండికేషన్సే ఇచ్చారు సీఎం కేసీఆర్‌. రాజ్యాంగాన్ని అతిక్రమించి వ్యవ‌హ‌రిస్తున్న గ‌వ‌ర్నర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ‌టంపై మ‌మ‌తా బెన‌ర్జీ ఆందోళ‌న వ్యక్తం చేశార‌ని చెప్పారు స్టాలిన్ (MK Stalin). రాష్ట్రాల స్వయంప్రతిప‌త్తిని కాపాడాల‌న్న వైఖ‌రికే క‌ట్టుబ‌డి ఉన్నట్లు దీదీకి హామీ ఇచ్చాన‌ని చెప్పారు తమిళనాడు సీఎం. రాజ్యాంగ నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా, సంప్రదాయాల‌ను తోసిరాజంటూ ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ, అక్కడి గ‌వ‌ర్నర్ జ‌గ‌దీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) ఆదేశాలు జారీ చేశార‌ని స్టాలిన్ చెప్పారు.

కాగా.. మ‌మ‌తా బెన‌ర్జీకి వ్యతిరేకంగా నిత్యం జ‌గ‌దీప్ ద‌న్కర్ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆరోప‌ణ‌లు, విమ‌ర్శల ద్వారా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవ‌ల గ‌వ‌ర్నర్ జ‌గ‌దీప్ ద‌న్కర్ ట్విట్టర్‌ను అన్‌ఫాలో చేస్తున్నట్లు ప్రక‌టించారు మ‌మ‌తా బెన‌ర్జీ. అటు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య ట్విటర్ వేదికగా వాడివేడి సంభాషణ జరిగింది. శాసన సభను ప్రొరోగ్ చేయడంపై ఆక్షేపించారు స్టాలిన్. అయితే, స్టాలిన్ వాస్తవాలను తెలుసుకోకుండా పరుషంగా మాట్లాడారని మండిపడ్డారు ధన్‌కర్. పరస్పరం గౌరవించుకోవడంలోనే ప్రజాస్వామ్యపు సౌందర్యం ఉంటుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అయితే.. మమతా బెనర్జీకి బాసటగా స్టాలిన్‌ చేసిన ట్వీట్‌పై పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఘాటుగా స్పందించారు. వాస్తవాలను పరిశీలించకుండా తీవ్రవ్యాఖ్యలు చేశారంటూ రీట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకే శాసనసభను ప్రొరోగ్‌ చేసినట్టు ధన్కర్ అభిప్రాయపడ్డారు.

Also Read:

UP Assembly Election 2022 Voting Live: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. సమరంలో హేమా హేమీలు..

PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..