ఫుల్ గా ఇక వలస కార్మికుల రైళ్లు.. కెపాసిటీ పెంచిన కేంద్రం
వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు నడుస్తున్న శ్రామిక్ రైళ్లను ఇక ఫుల్ కెపాసిటీతో నడపనున్నారు. ప్రస్తుతం ఒక్కో రైలుకు 1200 మంది వలస జీవులను అనుమతిస్తుండగా..

వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు నడుస్తున్న శ్రామిక్ రైళ్లను ఇక ఫుల్ కెపాసిటీతో నడపనున్నారు. ప్రస్తుతం ఒక్కో రైలుకు 1200 మంది వలస జీవులను అనుమతిస్తుండగా.. దీన్ని 1728 కి పెంచుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. రాష్ట్రాల అభ్యర్థన మేరకు ఫైనల్ స్టాపే కాకుండా రైళ్ల గమ్యంలో మూడు స్టాప్ ల సౌకర్యాన్ని అనుమతించాలని రైల్వే జోన్లను ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. ట్రెయిన్ లో స్లీపర్ బెర్తులకు సమానంగా కెపాసిటీ ఉండేట్టు చూడనున్నారు. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు రైల్వే శాఖ ఐదులక్షల మంది వలస కార్మికులను తరలించింది. త్వరలో రోజుకు 300 శ్రామిక్ రైళ్లను నడపనున్నారు.
వలస కార్మికులను తరలించేందుకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య సరిపోదని, లాక్ డౌన్ ముగిసేలోగా ఇంకా లక్షలాది కార్మికులను తరలించవలసి ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ నిన్న ట్వీట్ చేస్తూ.. రాబోయే రోజుల్లో మరిన్ని శ్రామిక్ రైళ్లను నడుపుతామని, అదే సమయంలో వీరి తరలింపులో ఏవైనా సమస్యలుంటే వాటిని కేంద్రం దృష్టికి తీసుకురావాలని కోరారు.