Mehbooba Mufti: ది కాశ్మీర్ ఫైల్స్ వల్లే జమ్మూలో హింస.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెహబూబా ముఫ్తీ..

'ది కాశ్మీర్ ఫైల్స్'(The Kashmir Files) జమ్ము కాశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తుందని పీపుల్స్ డెమోక్రటిక్‌ పార్టీ(PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) అన్నారు...

Mehbooba Mufti: ది కాశ్మీర్ ఫైల్స్ వల్లే జమ్మూలో హింస.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెహబూబా ముఫ్తీ..
Mehbooba Mufti
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 17, 2022 | 3:36 PM

‘ది కాశ్మీర్ ఫైల్స్'(The Kashmir Files) జమ్మూ కాశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తుందని పీపుల్స్ డెమోక్రటిక్‌ పార్టీ(PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) అన్నారు. కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆమె పై విధంగా స్పందించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాశ్మీరీ పండిట్లకు సురక్షితమైన వాతావరణం కల్పించామన్నారు. “మేము కాశ్మీరీ పండిట్‌లకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాము. 2016లో తీవ్ర అశాంతి సమయంలో,ఎటువంటి హత్య జరగలేదు. కాశ్మీర్ ఫైల్స్ చిత్రం హింసను ప్రేరేపించింది” అని Ms ముఫ్తీ చెప్పారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి హిందూ-ముస్లిం సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు రోజు ఫరూక్ అబ్దుల్లా ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. ఇది “దేశంలో ద్వేషపూరిత” వాతావరణాన్ని సృష్టించిందని ఆరోపించారు. సినిమాలో ఫేక్‌గా చిత్రీకరించిన సంఘటనలను ఉటంకిస్తూ “నిరాధారమైన” సినిమా తీశారని చెప్పారు.

గురువారం నాడు కాశ్మీరీ పండిట్, ప్రభుత్వ ఉద్యోగి అయిన రాహుల్ భట్ హత్య కారణంగా స్థానికులు నిరసనకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. నిరసన తర్వాత, హత్యపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో కోర్టు ఆదేశించిన వీడియోగ్రఫీ సర్వే మూడో రోజు కొనసాగింది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వేపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అంజుమన్ ఇంతెజామియా మసాజిద్ కమిటీ పిటిషన్‌ను ఈ రోజు విచారించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…