AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithyananda: తిండి లేదు.. నిద్ర లేదు.. జీవించాలని లేదు.. నిత్యానంద సంచలన ప్రకటన

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి(Nithyananda Swami) తాజాగా మరో ప్రకటన చేశారు. తన ఆరోగ్యం విషమించిందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్య ఫలితాలు వచ్చాయని తెలిపారు. అలాగే తాను తినలేనని..

Nithyananda: తిండి లేదు.. నిద్ర లేదు.. జీవించాలని లేదు.. నిత్యానంద సంచలన ప్రకటన
Nithyananda
Sanjay Kasula
|

Updated on: May 17, 2022 | 4:44 PM

Share

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి(Nithyananda Swami) తాజాగా మరో ప్రకటన చేశారు. తన ఆరోగ్యం విషమించిందని ఆయినా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్య ఫలితాలు వచ్చాయన్నారు. అలాగే తినలేకపోతున్నా.. నిద్రపోలేక పోతునాని చెప్పిన నిత్యానంద తనకు లోకంలో జీవించాలనే కోరిక లేదని.. అలా అని ప్రాపంచిక జీవితంపై ద్వేషం లేదంటూ ప్రకటించారు. నిత్యానంద సకల సౌకర్యాలతో కైలాసంలో జీవిస్తున్నారనే అభిప్రాయం మొదట్లో ఉండేది. తరువాత, తీవ్రమైన పేదరికం ఉందని ప్రచారం జరిగింది. కాగా, నిత్యానంద ఆరోగ్యం క్షీణించిందని, ఆయన మృతి చెందారని సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించడంతో కలకలం రేగింది. అనంతరం ఆయన ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

అయితే రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి. తాను బతికే ఉన్నానని.. 27 మంది డాక్టర్లు తనకు చికిత్స చేస్తున్నారని తాజా ఫేస్​బుక్​లో స్పష్టం చేశారు. ఈక్వెడార్​కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే.. తాజాగా ఈ వదంతులపై నిత్యానంద స్పందించారు. ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు. తాను సమాధిలోకి వెళ్లానని.. శిష్యులు కంగారుపడొద్దని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నట్లు.. మనుషులను గుర్తుపట్టలేకపోతున్నట్లు ఫేస్​బుక్​ పోస్ట్​లో పేర్కొన్నారు.

భారత్​లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్వామీజీ 50 సార్లు కోర్టుకు హాజరై.. 2019 నవంబర్​లో భారత్​ వదిలి పారిపోయారు. ‘కైలాస’ అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను పత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు.

కొద్దిరోజులకు కైలాస డాలర్​ను తీసుకొచ్చారు. తర్వాత రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈక్వెడార్‌ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది.

కైలాస’ అధికారిక వెబ్‌సైట్.. రోజూ నిత్యానందకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంటుంది. ఫేస్​బుక్​లో ఫొటోలు, వీడియోలను అప్​డేట్​ చేస్తుంటుంది. తాజాగా.. ఆయన ఫొటోలు సహా, ఆయన పేపర్​పై రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను షేర్​ చేసింది. అయితే ప్రస్తుతం.. కైలాస ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద బతికిఉన్నారా? చనిపోయారా? అనేది మిస్టరీగా ఉంది.