AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K Annamalai: మాజీ ఐపీఎస్ అధికారికి తమిళనాడు బీజేపీ పగ్గాలు.. పార్టీలో చేరిన ఏడాదికే కీలక బాధ్యతలు

Ex-IPS Officer K Annamalai: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  మాజీ ఐపీఎస్ అధికారి కే.అణ్నామలై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తమిళనాడు రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

K Annamalai:  మాజీ ఐపీఎస్ అధికారికి తమిళనాడు బీజేపీ పగ్గాలు.. పార్టీలో చేరిన ఏడాదికే కీలక బాధ్యతలు
Tamil Nadu BJP State President K Annamalai
Janardhan Veluru
|

Updated on: Jul 09, 2021 | 10:52 AM

Share

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  మాజీ ఐపీఎస్ అధికారి కే.అణ్నామలై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తమిళనాడు రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేశారు. కరూర్ జిల్లాకు చెందిన కే.అణ్నామలై 2011 కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన వయస్సు కేవలం 37 సంవత్సరాలు. అత్యంత పిన్న వయస్సులో తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులైన వ్యక్తి అణ్నామలై కావడం విశేషం. బీజేపీలో చేరి ఏడాది పూర్తికాకముందే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవడం విశేషం.  తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చిన ఎల్ మురుగన్ బుధవారంనాటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయన స్థానంలో కే.అణ్నామలైను పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం చకచకా నిర్ణయం తీసుకుంది. కే.అణ్నామలై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులుకావడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అణ్నామలై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియామకం కానున్నట్లు గత కొన్ని మాసాలుగానే తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ జాతీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో కర్ణాటకలోని చిక్కమంగళూరు, ఉడిపి జిల్లాలకు ఎస్పీగా, బెంగళూరు(దక్షిణ) డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన…2019 సెప్టెంబర్‌లో ఐపీఎస్ సేవల నుంచి వైదొలిగారు. రాజకీయ అరంగేట్రం కోసమే ఐపీఎస్ సేవలకు వీడ్కోలు పలికినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఐపీఎస్ సర్వీస్‌కు వీడ్కోలు పలికిన 11 మాసాల అనంతరం 2020 ఆగస్టులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచ్చి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అన్నాడీఎంకే మద్ధతుతో బరిలో నిలిచిన ఆయన అక్కడ.. కేవలం 24,816 ఓట్ల తేడాతో ఆయన డీఎంకే అభ్యర్థి ఆర్ ఇళంగో చేతిలో ఓటమిచెవిచూశారు.

Annamalai

Annamalai

మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన మేర ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు అక్కడ పార్టీని సన్నద్ధం చేయడం ప్రస్తుతం అణ్నామలై ముందున్న పెద్ద సవాలుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. యువ నాయకుడికి పార్టీ సారధ్య బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా తమిళనాడులో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ అగ్రనేతలు ఆశిస్తున్నారు. నేరగాళ్ల పట్ల ‘సింగం’ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కర్ణాటకలో మంచి గుర్తింపు సాధించారు.

తమిళనాడులో పార్టీ నిర్మాణం కోసం ఎందరో నేతలు, కార్యకర్తలు సేవలందించారని అణ్నామలై గుర్తుచేసుకున్నారు. వారి త్యాగాలు వృధా కానివ్వబోనని చెప్పారు. తమిళనాడు ప్రజలకు పార్టీని దగ్గర చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తానన్నారు. కే.అణ్నామలై శుక్రవారం సాయంత్రం చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

పశ్చిమ తమిళనాడులోని కరూర్ జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి అణ్నామలై. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన..కోయంబత్తూరులోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశారు. అలాగే ఐఐఎం లక్నోలో ఎంబీఏ డిగ్రీ చేశారు.

Also Read..

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన రేవంత్ రెడ్డా?.. కోవర్డ్ రెడ్డా? అంటూ..

వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే..!