AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి వద్దని పారిపోయి.. కలెక్టర్‌గా తిరిగొచ్చింది

ఏడేళ్ల క్రితం ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తుంటే వద్దని పారిపోయింది. కట్ చేస్తే కలెక్టర్‌గా తిరిగి ఇంటికి వెళ్లింది. అంతేకాదు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది

పెళ్లి వద్దని పారిపోయి.. కలెక్టర్‌గా తిరిగొచ్చింది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 6:14 PM

Share

Sanju Rani Verma: ఏడేళ్ల క్రితం ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తుంటే వద్దని పారిపోయింది. కట్ చేస్తే కలెక్టర్‌గా తిరిగి ఇంటికి వెళ్లింది. అంతేకాదు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగా జరిగిన సంఘటనే. వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌కు చెందిన సంజు రాణి వర్మ(28) తల్లి 2013లో కన్నుమూశారు. దాంతో ఆమె చదువును మానిపించిన తండ్రి పెళ్లి చేయాలనుకున్నారు. దానికి ససేమిరా అన్న సంజు.. కుటుంబ సభ్యులను వ్యతిరేకించి పారిపోయింది. ఇక అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన సంజు.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. ఆ తరువాత యూపీఎస్సీ పరీక్షలు రాసింది. ఇక ఇటీవల విడుదలైన ఫలితాల్లో ర్యాంక్‌ సాధించి కలెక్టర్‌గా ఎంపికైంది.

అయితే ఇంటి నుంచి బయటికి వచ్చిన తరువాత సంజు.. తన ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పారు. ప్రైవేట్ ఉద్యోగం చేసింది. ఏడేండ్ల పాటు కష్టపడి చదివి అనుకున్నది సాధించింది. దీనిపై మాట్లాడిన సంజు రాణి.. “ఇంటిని విడిచివెళ్లినప్పుడు అందరూ చాలా కోప్పడ్డారు. అయితే అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. యూపీఎస్సీ అధికారి కావడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటో తెలుసు. నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆధరిస్తా. అమ్మాయిలను చదువుకోనివ్వకుండా పెళ్లి పేరుతో ఒత్తిళ్లు చేయడం మానుకోవాలి. వారి స్వేచ్ఛను వారికిచ్చినప్పుడే భవిష్యత్ బావుంటుందని నమ్ముతా” అని చెప్పారు. తనలాగే అందరూ ఉన్నత విద్య చదువుకుని వారి వారి కలలను నిజం చేసుకోవాలి అని రాణి యువతకు సందేశమిస్తున్నారు.

Read More:

స్పెషల్ బర్త్‌డేని సింపుల్‌గా చేసుకున్న రమ్యకృష్ణ

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన విమానాల రాకపోకలు

Follow Us
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!