Breaking News
  • చైనాతో రగడపై రాజ్​నాథ్​ ప్రకటన: లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించింది. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు. మొత్తం 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి సైనికులను కలిశారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదు. ఎల్‌ఏసీ విషయంలో రెండుదేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు ఎంతో ప్రయత్నించాం. చైనాతో మేం స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నాం.
  • భారత దేశంలో ఇప్పటివరకు 38. 38.5 లక్షల మంది రోగులు కోలుకున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇప్పటివరకు 5.8 కోట్ల నమూనాలను పరీక్షించారు. గత వారం 76 లక్షల పరీక్షలు జరిగాయి. క్రియాశీల(యాక్టివ్ ) కేసులు మొత్తం కేసులలో 1/5 వ వంతు మాత్రమే. ఐదు రాష్ట్రాలు - మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మరియు తమిళనాడు దేశంలో మొత్తం యాక్టివ్ కేసులలో 60% ఉన్నాయి. భారతదేశంలో మిలియన్ జనాభాకు కేసులు 3,573, ప్రపంచ సగటు మిలియన్ జనాభాకు 3,704 కేసులు. భారతదేశంలో మిలియన్ జనాభాకు మరణాలు 58, ప్రపంచంలో అత్యల్పంగా ఉన్నాయి. ప్రపంచ సగటు 118. దేశంలో 18 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో యాక్టివ్ కేసులు 5,000 మరియు 50,000 మధ్య ఉన్నాయి ప్లాస్మా థెరపీని 100 సంవత్సరాలకు పైగా ఏదో ఒక రూపంలో లేదా వివిధ వైరస్ ఇన్ఫెక్షన్లకు ఉపయోగిస్తున్నారు. ఇది ప్రస్తుతం COVID19 చికిత్సలో ఉపయోగించబడుతోంది. ఇది కరోనాను తగ్గించడానిక్ సహాయపడుతుందో లేదో అధ్యయనం చేయబడుతోంది. కేవలం 27 రోజులలో దేశంలో ఒక కోటి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల నుండి 2 కోట్ల కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసాము. భారత దేశంలో పాజిటివిటీ రేటు 8.14 శాతంగా ఉంది. 14 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 25 జిల్లాల్లోని 39 ఆసుపత్రులలో 464 మంది రోగులపై యాదృచ్ఛిక విచారణకు భారతదేశం అంతర్జాతీయంగా సహకరించింది. - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.
  • కృష్ణవరం టోల్‌గేట్ వద్ద లారీ బీభత్సం . తూర్పుగోదావరి జిల్లా : కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో మూడు కార్లను ఢీకొట్టి, టోల్ గేట్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
  • అమరావతి: మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు. రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భాగస్వామి అయ్యారన్న ఏసీబీ. భూముల కొనుగోళ్లలో ఏజీగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అబియోగం. పదవిని అడ్డుపెట్టుకుని బంధువులతో 2014లో భూమి కొనుగోలు చేయించిన శ్రీనివాస్. 2015, 2016లో ఆ భూములు కొన్నట్లు ఏసీబీ అభియోగాలు. తన పేరిట, భార్య పేరిట దమ్మాలపాటి శ్రీనివాస్ భూముల కొనుగోళ్లు. ఇప్పటికే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కోరుతూ హైకోర్టులో పిటిషన్‌.
  • శాస‌న మండ‌లి... టీఎస్ బిపాస్ చర్చలో మంత్రి కేటీఆర్ : టీఎస్ బిపాస్ ప్రజలకు బ్రహ్మాస్త్రం. 75 గజాలు లోపు అని.. అనుమతులు అవసరం లేదు కదా అని కుతుబ్ మినార్ కడితే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు . అక్టోబర్ మొదటి వారంలో హైకోర్టు లో బీఆర్ఎస్ పై విచారణ ఉంది . బిల్డింగ్ ,లే అవుట్ పర్మిషన్ ల కోసం టిఎస్ బిపాస్ సూపరియర్ చట్టం . ఎన్వోసి బాధ్యత కూడా మున్సిపల్ శాఖదే టీఎస్ బిపాస్ అర్బన్ గవర్నెన్స్ లో విప్లవాత్మకమైన అడుగు . భవన నిర్మాణ అనుమతికి టౌన్ ప్లానింగ్ అధికారుల దయ ...మన ప్రాప్తంకు టీఎస్ బిపాస్ తో చరమ గీతం . బిల్డింగ్ నిర్మాణంకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే...22 వ రోజు అనుమతి వచ్చినట్టే సెల్ఫ్ సర్టిఫికేషన్ లో అప్లై చేసుకున్న స్థలంలో కాకుండా నిర్మాణాలు చేపడితే....నోటీసులు లేకుండా కూల్చివేస్తారు. టీఎస్ బిపాస్ బిల్లు 2020కి శాసన మండలి ఆమోదం.
  • టివి9 ఎఫెక్ట్: మదీనాగూడ లో మంజీర పైపులైన్ లికేజీ పనులు ప్రారంభించిన వాటర్ బోర్డు. అర్ధరాత్రి వాటర్ ఫోర్స్ తో బ్రేక్ అయిన పైప్ లైన్. స్థానిక అపార్టుమెంట్స్,కాలనీల్లో ప్రవేశించిన వాటర్. నీటమునిగిన పరిసర అపార్టుమెంట్స్. వాటర్ ఫ్లో రావడంతో భయబ్రాంతులకు గురై అపార్ట్మెంట్ వాసులు. పూర్తిగా నీటిలో మునిగి డేమెజ్ అయిన సెల్లార్స్ లోని వాహనాలు . బయటికి రావడానికి వీలు కాకపోవడంతో రాత్రి నుండి ఇళ్లలోనే ఉండి అపార్టెమెంట్ వాసులు. పైప్ లైన్ లీకేజీని బహిర్గతం చేసిన టివి9 . టివి9 వార్తా కథనాలతో స్పందించిన అధికారులు.

స్పెషల్ బర్త్‌డేని సింపుల్‌గా చేసుకున్న రమ్యకృష్ణ

అందాల తార, శివగామి రమ్యకృష్ణకి ఈరోజు చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే ఇవాళ రమ్యకృష్ణ తన స్పెషల్ బర్త్‌డే(50వ పుట్టినరోజు)ని జరుపుకుంటున్నారు
Ramya Krishnan Birthday, స్పెషల్ బర్త్‌డేని సింపుల్‌గా చేసుకున్న రమ్యకృష్ణ

Ramya Krishnan Birthday: అందాల తార, శివగామి రమ్యకృష్ణకి ఈరోజు చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే ఇవాళ రమ్యకృష్ణ తన స్పెషల్ బర్త్‌డే(50వ పుట్టినరోజు)ని జరుపుకుంటున్నారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ పుట్టినరోజును సింపుల్‌గా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రమ్యకృష్ణ పుట్టినరోజును జరుపుకోగా.. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకోవడం కంటే ఆనందం ఏముంటింది అని రమ్యకృష్ణ కామెంట్ పెట్టారు. ఇక ఆ ఫొటోలో రమ్యకృష్ణ భర్త, దర్శకుడు కృష్ణవంశీ, ఆమె కుమారుడు రిత్విక్ వంశీ ఉన్నారు. అయితే కాస్త సిగ్గరి అయిన రిత్విక్.. ఈ ఫొటోలో తన మొహం కనిపించకుండా చేతిని అడ్డు పెట్టుకున్నారు.

కాగా 1983లో ‘వెల్లై మనసు’ అనే తమిళ చిత్రం ద్వారా రమ్యకృష్ణ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించారు. వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. బుల్లితెర మీదా పలు సీరియళ్లలో నటించారు. ఇక క్వీన్‌తో వెబ్‌ సిరీస్‌లోకి కూడా అడుగుపెట్టారు.

Read More:

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన విమానాల రాకపోకలు

‘వి’ ఎఫెక్ట్‌.. ‘టక్‌ జగదీష్‌’లో మార్పులు..!

https://twitter.com/meramyakrishnan/status/1305584362293878784/photo/1

Related Tags