శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన విమానాల రాకపోకలు

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దేశీయంగా  మే 25 నుంచి విమాన సర్వీసులు  ప్రారంభమైన విషయం తెలిసిందే

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన విమానాల రాకపోకలు
Follow us

| Edited By:

Updated on: Sep 15, 2020 | 4:41 PM

Shamshabad Airport News: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దేశీయంగా  మే 25 నుంచి విమాన సర్వీసులు  ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో విమానాల రాకపోకలు పెరిగాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి దేశీయంగా 93 శాతం ప్రాంతాలకు రాకపోకలు జరుగుతున్నాయి. మొదట్లో రోజుకు మూడు వేల మంది ప్రయాణికులు వెళుతుండగా.. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రోజుకు 20-22 వేలకు ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా సాధారణ రోజుల్లో ఎయిర్‌పోర్టు నుంచి 55-60వేల మంది ప్రయాణికులు వెళ్లేవారని వారు అంటున్నారు.

ఇక అంతర్జాతీయ సర్వీసులు సైతం పునరుద్ధరించారు. దీంతో ప్రస్తుతం ఎయిర్ పోర్టు నుంచి 220 జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. కాగా శంషాబాద్ నుంచి సాధారణ రోజుల్లో నిత్యం 550-570 సర్వీసుల రాకపోకలు ఉండేవి. మరోవైపు దేశంలోని ఉదయ్‌పుర్‌, అమృత్‌సర్‌, పుదుచ్చేరి, బళ్లారి పట్టణాలకు  ఇంకా విమాన సర్వీసులు ప్రారంభం కాలేదు.

Read More:

‘వి’ ఎఫెక్ట్‌.. ‘టక్‌ జగదీష్‌’లో మార్పులు..!

ఎన్టీఆర్ ‘వయసునామి’కి జపాన్ జంట డ్యాన్స్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే