Encounter: భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి
Encounter: ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అడవి చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టినట్లు బలగాలు తెలిపాయి. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సింగిల్-లోడింగ్ రైఫిల్స్, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం..

Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు –మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) జవాన్లు అమరులయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అడవుల్లో ఇతర నక్సల్స్ కోసం గాలింపు కొనసాగుతోందని భద్రతా బలగాలు తెలిపాయి. బస్తర్ డివిజన్‌లోని దంతెవాడను ఆనుకుని ఉన్న గంగాలూరు ప్రాంత అడవుల్లో నక్సల్స్ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పాటలింగం తెలిపారు. ఈ సమయంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. DRGతో పాటు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, CRPF కోబ్రా కమాండోలు నాయకత్వం వహించగా 12 మంది మావోయిస్టులు మరణించారు.
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అడవి చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టినట్లు బలగాలు తెలిపాయి. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సింగిల్-లోడింగ్ రైఫిల్స్, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
అయితే నక్సలైట్లు ఈ ప్రాంతంలో ఆయుధాలు దాచిపెట్టారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి అదనపు దళాలు మోహరించాయి. కాగా, ఈ సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో 268 మంది నక్సలైట్లు మరణించినట్లు వెల్లడించాయి. ఇందులో 239 మంది నక్సలైట్లు బస్తర్ డివిజన్‌లో మరణించారు. మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీని కింద, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




