AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జూపార్క్‌లో సింహాం డెన్‌లోకి దిగిన యువకుడు.. ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాక్‌!

సాధారణంగా సింహాన్ని దూరంగా చూడాలంటేనే భయపడుతుంటారు. ఇక దగ్గరికి వచ్చిందంటే పై ప్రాణాలు పైనే పోయేంత పనైతది. కానీ జూపార్కుల్లో కొంత సింహాలతో ఆటలాడి వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. సింహం దగ్గరికి వెళ్లి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం...

Viral Video: జూపార్క్‌లో సింహాం డెన్‌లోకి దిగిన యువకుడు.. ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాక్‌!
Lion Kills Man In Zoo
K Sammaiah
|

Updated on: Dec 03, 2025 | 5:51 PM

Share

సాధారణంగా సింహాన్ని దూరంగా చూడాలంటేనే భయపడుతుంటారు. ఇక దగ్గరికి వచ్చిందంటే పై ప్రాణాలు పైనే పోయేంత పనైతది. కానీ జూపార్కుల్లో కొంత సింహాలతో ఆటలాడి వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. సింహం దగ్గరికి వెళ్లి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బ్రెజిల్‌లో జరిగిన ఓ ఓ హృదయ విదారక ఘటన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింహాన్ని దగ్గరగా చూడాలనే కోరిక .. ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకున్నది. స్థానికులను ఉలిక్కిపడేలా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. బ్రెజిల్‌లోని అరుడా కామరా జూ పార్క్‌లో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

వీడియోలో ఓ యువకుడు సింహాన్ని మరింత దగ్గరగా చూడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో సింహం డెన్‌ పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా సింహం ఉండే బ్యారక్‌లోకి దిగాడు. దూరం నుంచి యువకుడి కదలికలను గమనించిన సింహం కొన్ని క్షణాల్లోనే అతడి వద్దకు పరిగెత్తింది. ఆ యువకుడు చెట్టు మీద ఉండగానే సింహం కిందకు లాగింది. కింద పడిన యువకుడిని పొదలవైపు లాక్కెళ్లడం వీడియోలో కనిపిస్తుంది.

జూ సిబ్బంది స్పందించేలోపే అతడు సింహం చేతిలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను దూరంగా ఉన్న సందర్శకులు వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది. సందర్శకులు, స్థానికులు ఒక్కసారికి భయాందోళన చెందారు. జూలో “భద్రతా నియమాలను ఉల్లంఘించడం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని అధికారులు తెలిపారు. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లే ప్రయత్నాలు అసలు చేయకూడదు” అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.

వీడియో చూడండి: