Uttar Pradesh: కారుణ్య నియామకాల విషయంలో యూపీ కీలక నిర్ణయం.. ఇకపై వారు కూడా ఆ ఉద్యోగాలకు అర్హులే..

కారుణ్య నియామకాలకు పెళ్లైన మహిళలు కూడా అర్హులే అని కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే..

Uttar Pradesh: కారుణ్య నియామకాల విషయంలో యూపీ కీలక నిర్ణయం.. ఇకపై వారు కూడా ఆ ఉద్యోగాలకు అర్హులే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2021 | 7:26 PM

కారుణ్య నియామకాలకు పెళ్లైన మహిళలు కూడా అర్హులే అని కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కారుణ్య నియామక అర్హతల్లో ‘అవివాహిత’ అనే పదాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ కొట్టివేసింది. ఆ తర్వాత అలహాబాద్‌ హైకోర్టు కూడా ఓ కేసు విచారణ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ కూడా ఏపీ, అలహాబాద్‌ హైకోర్టుల బాటల్లోనే నడిచింది. కారుణ్య నియామకాలకు సంబంధించి ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు చనిపోతే కారుణ్య నియామకాల కింద ఆ ఉద్యోగాలను పొందేందుకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యోగ నియామకాల శాఖ తీసుకున్న నిర్ణయానికి ఉత్తర ప్రదేశ్‌ క్యాబినేట్‌ ఆమోద ముద్ర వేసింది.

సాధారణంగా సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకాల కింద ఆ ఉద్యోగాన్ని భార్య, కుమారుడు లేదా పెళ్లికాని కుమార్తెలకు కేటాయించేవారు. ఒకవేళ కూతుళ్లకు వివాహమై ఉంటే ఈ నియామకాలకు అనర్హులుగా పరిగణించేవారు. కుమారులు ఉన్న కుటుంబాల సంగతి పక్కన పెడితే కేవలం ఒక కుమార్తె ఉన్న కుటుంబాలకు ఈ రూల్స్‌ గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. కారుణ్య నియామకాల ప్రయోజనాన్ని పొందలేకపోయేవారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కారుణ్య నియామకాల నిబంధనలను సవరించింది. ఇక గతంలో ఓ కేసు విచారణ సమయంలో అలహాబద్‌ హైకోర్టు కుటుంబంలో వివాహితులైన కుమార్తెలను కలపకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం ఈ విషయంలో పునరాలోచించాలని సూచించిన సంగతి తెలిసిందే.

Also Read:

CBI: ఏపీ న్యాయాధికారులపై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్ ప్రభాకర్‍తో పాటు మరో నిందితుడికి ఇంటర్‌పోల్ బ్లూ నోటీసులు

ఉద్యోగినిపై సెక్రటరీ స్థాయి అధికారి లైంగిక వేధింపులు.. సంచలనంగా మారిన వీడియో.. నిందితుడి అరెస్ట్..

Governor’s Conference: ప్రజలకు, ప్రభుత్వానికి గవర్నర్‌ ఓ స్నేహితుడు.. ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే