Governor’s Conference: ప్రజలకు, ప్రభుత్వానికి గవర్నర్‌ ఓ స్నేహితుడు.. ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రాల అభివృద్దిలో గవర్నర్ల పాత్ర చాలా కీలకమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ప్రజా సమస్యలను తీర్చడానికి చురుగ్గా పనిచేయాలని గవర్నర్ల సదస్సులో ఆయన పిలుపునిచ్చారు.

Governor's Conference: ప్రజలకు, ప్రభుత్వానికి గవర్నర్‌ ఓ స్నేహితుడు.. ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
Governors Meet
Follow us

|

Updated on: Nov 11, 2021 | 5:06 PM

51st Conference of Governors and Lt Governors: రాష్ట్రాల అభివృద్దిలో గవర్నర్ల పాత్ర చాలా కీలకమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ప్రజా సమస్యలను తీర్చడానికి చురుగ్గా పనిచేయాలని గవర్నర్ల సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్‌ పదవికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ప్రజలకు, ప్రభుత్వానికి గవర్నర్‌ ఓ స్నేహితుడిలా ఉంటారని అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంరయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథులుగా హాజరు కాగా, అన్ని రాష్ట్రాల గవర్నర్లు , కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారు.

గవర్నర్లు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని రాష్ట్రపతి.. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోవింద్ సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. దేశ లక్ష్యాలను సాధించడానికి ప్రజలను భాగస్వామ్యం చేయడంలో గవర్నర్ల పాత్ర కీలకమన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలపై గవర్నర్లు ఎక్కువ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. కరోనాపై పోరులో గవర్నర్లు కూడా కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

ప్రతి ఏటా రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత ఏడాది కరోనా కారణంగా ఈ భేటీ జరగలేదు. 1949 నుంచి గవర్నర్ల సదస్సు అనవాయితీగా జరుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా గవర్నర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో విద్యా సంస్కరణలను అమలు చేయడంలో గవర్నర్లది కీలక పాత్ర పోషించాలన్నారు అమిత్‌షా. యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు గవర్నర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారని , దీనిని రాష్ట్రాలు అమలు చేసే విధంగా గవర్నర్లు కృషి చేయాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడడానికి గ్లాస్గోలో జరిగిన కాప్‌ సదస్సులో ప్రధాని మోడీ ప్రపంచదేశాలకు కీలక సూచనలు చేశారని, ఆ సూచనలను రాష్ట్రాల్లో కూడా అమలయ్యేలా చూడాలని గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు అమిత్‌షా. Read Also… CM Jagan: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలి.. సీఎం జగన్ ఆదేశం..