Varun on Kangana: “కంగనా రనౌత్‌కు పిచ్చిపట్టింది.. దేశ ద్రోహి” అంటూ విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ!
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారింది సినీ నటి కంగనా రనౌత్. ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్లమెంటు సభ్యులు వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
Varun Gandhi vs Kangana Ranaut: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారింది సినీ నటి కంగనా రనౌత్. ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్లమెంటు సభ్యులు వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమెకు పిచ్చి పట్టిందని , ముమ్మాటికి ఆమె దేశద్రోహానికి పాల్పడిందని అంటూ వరుణ్ ధ్వజమెత్తారు. భారత్‌కు 1947లో స్వాతంత్ర్యం రాలేదని , అది బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష అని , నిజమైన స్వాతంత్ర్యం 2014లో దేశప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాతే వచ్చిందని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కంగనా తీరుపై విరుచుకుపడ్డారు వరుణ్‌గాంధీ .
కొన్నిసార్లు కంగనా మహాత్మాగాంధీని అవమానించిందని , గాంధీ హంతుకులను ఆమె పొగిడిందని మండిపడ్డారు వరుణ్‌గాంధీ. మంగళ్‌పాండే మొదలు రాణి లక్ష్మీబాయి, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్.. ఇలా లక్షలాది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అవమానించిందని మండిపడ్డారు . పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
ఇటీవలి కాలంలో అసమ్మతి రాగం వినిపిస్తున్న గాంధీ, ఓ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో కంగనా రనౌత్ వ్యాఖ్యల చిన్న క్లిప్‌ను పోస్ట్ చేసారు. ఇందలో ఆమె హిందీలో స్వాతంత్ర్యం కాదు భీఖ్, నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది అంటూ వ్యాఖ్యానించారు. ఈ నెలలో ప్రధాని మోడీ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందుకున్న కంగనా, 2014లో బీజేపీ అధికారంలోకి రావడం గురించి ప్రస్తావించారు.
ఆమె వ్యాఖ్యలను ఖండించిన వరుణ్ గాంధీ హిందీలో ట్వీట్ చేస్తూ, “మహాత్మా గాంధీ త్యాగాన్ని కొన్నిసార్లు అవమానించడం, కొన్నిసార్లు అతని హంతకుడిని ప్రశంసించడం, ఇప్పుడు మంగళ్ పాండే, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి లక్షలాది మంది త్యాగాలను తృణీకరించడం. స్వాతంత్ర్య సమరయోధులు. నేను ఈ ఆలోచనను పిచ్చిగా పిలుస్తానా, ఆమెది దేశద్రోహం అని పిలుస్తానా?” అంటూ పేర్కొన్నారు.
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z
— Varun Gandhi (@varungandhi80) November 11, 2021
ఇదిలావుంటే, గత నెలలో, యుపీలోని లఖీంపూర్ ఖేరీలో మరణించిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని పిలుపునిచ్చిన తరువాత వరుణ్ గాంధీని, ఆ పార్టీ జాతీయ కార్యవర్గం నుండి తొలగించారు. అంతకు ముందు కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇతర రైతులకు మద్దతుగా మాట్లాడారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే మూడ్‌లో లేనట్లుగా, వరుణ్ గాంధీ తన పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు, అటల్ బిహారీ వాజ్‌పేయికి సంబంధించిన తేదీ లేని వీడియోను ట్వీట్ చేయడం ద్వారా, దివంగత మాజీ ప్రధాని రైతులను బెదిరించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదిలావుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను నియంత్రిస్తున్న నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుడు వరుణ్ గాంధీ. అతని తల్లి 2004లో పార్టీ అధికారం నుండి బయటకు వెళ్లడానికి కొద్ది నెలల ముందు బీజేపీలో చేరారు. అయితే ఇటీవలి సంవత్సరాలలో నాయకత్వం పట్ల అభిమానం కోల్పోయిన ఆయన సొంత పార్టీపైనే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు.
Read Also… Bumper Offier: కరోనా టీకా తీసుకుంటే రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఎల్‌ఈడీ టీవీ.. ఇదెక్కడంటే..?