14 ఏళ్ల త‌ర్వాత దొరికిన ప‌ర్సు.. అవాక్క‌యిన వ్య‌క్తి

14 ఏళ్ల త‌ర్వాత దొరికిన ప‌ర్సు.. అవాక్క‌యిన వ్య‌క్తి

సాధార‌ణంగా ప‌ర్సు పోతే.. మ‌ళ్లీ అది దొర‌క‌ద‌ని ఆశ‌లు వ‌దులు కోవ‌ల్సిందే. కానీ.. 14 ఏళ్ల త‌ర్వాత ప‌ర్సు దొర‌క‌డ‌మంటే మాట‌లా! వివ‌రాల్లోకి వెళ్తే.. 2006లో ముంబైలోని లోక‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణిస్తున్న హేమంత్ ప‌దాల్క‌ర్ అనే వ్య‌క్తి త‌న ప‌ర్సు..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 12:51 PM

సాధార‌ణంగా ప‌ర్సు పోతే.. మ‌ళ్లీ అది దొర‌క‌ద‌ని ఆశ‌లు వ‌దులు కోవ‌ల్సిందే. కానీ.. 14 ఏళ్ల త‌ర్వాత ప‌ర్సు దొర‌క‌డ‌మంటే మాట‌లా! వివ‌రాల్లోకి వెళ్తే.. 2006లో ముంబైలోని లోక‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణిస్తున్న హేమంత్ ప‌దాల్క‌ర్ అనే వ్య‌క్తి త‌న ప‌ర్సు పోగొట్టుకున్నాడు. అప్పుడు అందులో రూ.900 ఉన్నాయి. అప్ప‌ట్లో 900 రూపాయ‌లు అంటే ఎంతో ఎక్కువ‌. దీంతో ఆ త‌ర్వాత హేమంత్ వెంట‌నే పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ర‌ద్దీగా ఉంటే ట్రైన్ కాబ‌ట్టి ఎవడో కొట్టేసి ఉంటాడు. ఇక అది దొర‌క‌క‌పోవ‌చ్చని అనుకున్నారు పోలీసులు.

కానీ 14 ఏళ్ల త‌ర్వాత హేమంత్‌కి పోలీసుల నుంచి కాల్ వ‌చ్చింది. మీ ప‌ర్సు దొరికింది. వ‌చ్చి తీసుకెళ్లండి అని చెప్పారు. ఇది విన్న హేమంత్ ప‌దాల్క‌ర్ షాక్ తిన్నాడు. నిజ‌మా సర్ అని ఆశ్య‌ర్య పోయాడు. వెంట‌నే ప‌ర్సు తీసుకోవ‌డానికి వాషీకి వెళ్లాడు. పూర్తిగా పాడైన అత‌ని ప‌ర్సు తీసుకొచ్చి పోలీసులు చూపించారు. ఆ ప‌ర్సు నాదే అన్నాడు. అందులో రూ.900 ఉంటాయి అన్నాడు. నిజంగానే అందులో ఉన్నాయి.

కానీ పోలీసులు ర‌ద్దైన 500 రూపాయ‌లు తీసుకుని, మిగ‌తా డ‌బ్బును ఇచ్చేశారు. ఎందుకంటే అది 2016లో ర‌ద్దైన నోటు, ఇప్పుడు చెల్ల‌దు. త్వ‌ర‌లోనే దాన్ని ఎక్స్ ఛేంజ్ చేయించి అప్పుడు రూ.500 అకౌంట్‌లోకి ట్రాన్స్ ఫ‌ర్ చేస్తామ‌ని పోలీసులు చెప్పారు. దాంతో హేమంత్ షుఖీ అయిపోయాడు. ఇంత‌కీ ప‌ర్సు ఎక్క‌డ దొరికిందంటే.. ఇటీవ‌లే ఓ దొంగ‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని ద‌గ్గ‌ర దీన్ని గుర్తించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu