AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇవ్వన్నీ యాడ నుంచి తీసుకువచ్చార్రా.. మణిపూర్‌లో భారీగా ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం..

మణిపూర్‌లో అల్లరిమూకలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. మణిపూర్‌ పోలీసులు, అసోం రైఫిల్స్‌, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు జిల్లాల్లో సోదాలు చేసిన పోలీసులు, భద్రతా బలగాలు 328 అధునాతన ఆయుధాలను సీజ్‌ చేశాయి.

వామ్మో.. ఇవ్వన్నీ యాడ నుంచి తీసుకువచ్చార్రా.. మణిపూర్‌లో భారీగా ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం..
Manipur Security Forces Recover Arms
Shaik Madar Saheb
|

Updated on: Jun 14, 2025 | 4:11 PM

Share

మణిపూర్‌లో అల్లరిమూకలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. మణిపూర్‌ పోలీసులు, అసోం రైఫిల్స్‌, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు జిల్లాల్లో సోదాలు చేసిన భద్రతా బలగాలు 328 అధునాతన ఆయుధాలను సీజ్‌ చేశాయి. 151 SLR రైఫిళ్లు, 65 ఇన్సాస్‌ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 9,300 రౌండ్ల బుల్లెట్లతోపాటు.. భారీగా పేలుడు పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు .. మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్, కాక్చింగ్, తౌబాల్ అనే ఐదు లోయ జిల్లాల శివార్లలో జూన్ 13-14 మధ్య రాత్రి నిఘా వర్గాల నేతృత్వంలో దాడులు నిర్వహించినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు.

“ఉమ్మడి బృందాలు పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాల నిల్వలను స్వాధీనం చేసుకున్నాయి. 151 SLR రైఫిల్, 65 ఇన్సాస్ రైఫిల్స్, ఇతర రకాల 73 రైఫిల్స్, 5 కార్బైన్ గన్, 2 MP-5 గన్, భారీగా బుల్లెట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నాయి” అని మణిపూర్ పోలీసు ADGP లారి డోర్జీ లాటూ తెలిపారు. మొత్తం తుపాకులు, రైఫిళ్లు 328 స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.

మణిపూర్‌లో శాంతిభద్రతలు కాపాడడానికి ప్రజలకు సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. అరాచకశక్తులపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు ఏడీజీపీ డార్జీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతామని వెల్లడించారు.

సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అందరూ సహకరించాలని.. మణిపూర్ పోలీసులు, భద్రతా దళాలు కోరాయి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్