Cigarette Murder: తాగేందుకు సిగరెట్‌ ఇవ్వలేదని స్నేహితుడినే చంపాడు.. 30 అడుగుల లోయలోకి నెట్టి దారుణంగా..

క్షణికావేశంలో కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నా. కోపంలో ప్రాణ స్నేహితులనే కడతేర్చుతున్నారు. తాజాగా.. ఓ యువకుడు స్నేహితుడిని దారుణంగా చంపాడు.

Cigarette Murder: తాగేందుకు సిగరెట్‌ ఇవ్వలేదని స్నేహితుడినే చంపాడు.. 30 అడుగుల లోయలోకి నెట్టి దారుణంగా..
Smoking
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 29, 2022 | 12:29 PM

క్షణికావేశంలో కొందరు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోపంలో ప్రాణ స్నేహితులనే కడతేర్చుతున్నారు. తాజాగా.. ఓ యువకుడు స్నేహితుడిని దారుణంగా చంపాడు. సిగరెట్ దమ్ము ఇవ్వలేదన్న కారణంతో గుంతలోకి తోసి హత్యచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. సిగరెట్ పంచుకోలేదన్న కారణంతో శుక్రవారం ఆగ్రా జిల్లాలో 27 ఏళ్ల యువకుడిని అతని స్నేహితుడే హత్య చేశాడని.. పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన కప్తాన్ సింగ్, సుహైల్ ఖాన్‌ స్నేహితులు.. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి సిగరెట్ తాగేందుకు కోట దగ్గరకు వెళ్లారు. స్నేహితులిద్దరూ కోట గోడపై కూర్చుని సిగరెట్ తాగుతుండగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఆవేశానికి లోనైన నిందితుడు సుహైల్‌ ఖాన్‌.. తన స్నేహితుడు కప్తాన్‌ సింగ్‌ ను 30 అడుగుల లోతున్న గుంతలోకి తోసి చంపేశాడని వెల్లడించారు. గమనించిన స్థానికులు తీవ్రగాయాలైన కప్తాన్‌ సింగ్‌ ను ఆసుపత్రికి తరలించారు.

అయితే, చనిపోయే ముందు, ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కప్తాన్‌ సింగ్‌ అతని సోదరుడు లఖన్‌ సింగ్‌కు ఫోన్ చేశాడు.తన స్నేహితుడు సుహైల్ ఖాన్‌ను కలవడానికి వెళ్లానని.. ఈ సమయంలో జరిగిన మొత్తం సంఘటన గురించి తమ్ముడికి వివరించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు ఆగ్రాలోని రాకబ్‌గంజ్ ఎస్‌హెచ్‌ఓ రాకేశ్ కుమార్ తెలిపారు. విచారణ సమయంలో నిందితుడు తాను మత్తులో ఉన్నానని.. సిగరెట్ కోసం చాలాసార్లు అడిగానని, కానీ అతను నిరాకరించడంతో కోట గోడపై నుంచి నెట్టాడని పోలీసులకు చెప్పినట్లు వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..