AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurgaon: కారులో పేలిన క్రాకర్స్.. ఇన్ స్టా గ్రామ్ కోసం వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..

సోషల్ మీడియా పిచ్చి నేటి యువతలో బలంగా నాటుకుపోయింది. లైక్స్, షేర్స్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తప్పని తెలిసినా తప్పదన్నంటుగా తప్పు చేస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాలకూ ముప్పు తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా..

Gurgaon: కారులో పేలిన క్రాకర్స్.. ఇన్ స్టా గ్రామ్ కోసం వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..
Crackers Blast In Car
Ganesh Mudavath
|

Updated on: Oct 29, 2022 | 11:52 AM

Share

సోషల్ మీడియా పిచ్చి నేటి యువతలో బలంగా నాటుకుపోయింది. లైక్స్, షేర్స్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తప్పని తెలిసినా తప్పదన్నంటుగా తప్పు చేస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాలకూ ముప్పు తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా ఎదుటి వారి ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తున్నారు. దీపావళి అంటేనే వెలుగులు పండుగ, దీపాల పర్వదినం. ఇంటి ముందు, ఇంట్లో రంగు రంగుల దీపాలు అలంకరించి పండుగ జరుపుకోవడం భారతీయ సాంప్రదాయం. బాణాసంచా కాల్చడాన్ని కూడా మనం గమనించవచ్చు. అయితే కొందరు వ్యక్తులు చేసిన పని మాత్రం అందరినీ హడెలెత్తించింది. హైవే పై వెళ్తున్న కారు లోనుంచి ఒక్కసారిగా బాణా సంచా కాల్చారు. తోటి ప్రయాణీకును భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గుర్గావ్‌లోని సైబర్ హబ్ సమీపంలో టపాసులు పేలుతుండగా కారు డ్రైవింగ్ చేసిన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు.

ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రజల ప్రాణాలకు హాని కలగేలా భయభ్రాంతులకు గురి చేశారంటూ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రీల్‌గా అప్‌లోడ్ చేయడానికి ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులు విచారణలో చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గుర్గావ్ లోని శంకర్ చౌక్ వైపు నుంచి గోల్ఫ్ కోర్స్ రోడ్ వైపు కొందరు వ్యక్తులు బ్లాక్ కారులో వెళ్తున్నారు. కారు నడుస్తున్న సమయంలో లోపల కూర్చున్న యువకులు బాణాసంచా తీసి కాల్చారు. ఈ తతంగాన్నంతా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. దీపావళి రాత్రి తాము వీడియోను రికార్డ్ చేసినట్లు విచారణలో నిందితులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. జతిన్ బీఎమ్డబ్ల్యూ కారులో తమ బ్లాక్ సెడాన్‌ను అనుసరిస్తున్న తన స్నేహితుడు క్రిషన్‌తో వీడియో రికార్డ్ చేయించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..