Living relationship: ప్రేమించుకొని లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.. అవసరం తీరాక.. ?
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమికులు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. అయితే ఇందులో కొందరు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మరికొందరు మనస్పర్థలతో వాడికి బ్రేక్ చెప్పేస్తున్నారు. కానీ ఇటీవల లివింగ్ రిలేషన్‌లో ఉండగానే.. హత్యలు జరిగిన ఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలోని శ్రద్దా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ప్రేమ పేరుతో ఆమెను వంచించి.. చివరికి ఆమెను హత్య చేశాడు ప్రేమికుడు.
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమికులు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. అయితే ఇందులో కొందరు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మరికొందరు మనస్పర్థలతో వాడికి బ్రేక్ చెప్పేస్తున్నారు. కానీ ఇటీవల లివింగ్ రిలేషన్‌లో ఉండగానే.. హత్యలు జరిగిన ఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలోని శ్రద్దా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ప్రేమ పేరుతో ఆమెను వంచించి.. చివరికి ఆమెను హత్య చేశాడు ప్రేమికుడు. ఆమెను ముక్కలు ముక్కలుగా కోసి సూటుకేసులో పెట్టి ఆ శరీర భాగాలను బయట పారేశాడు. ఆ తర్వాత ఇలాంటి హత్య కేసులు మరికొన్ని జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన సినీ మేకప్ ఆర్టిస్ట్ నైనా మహత్(29) కు మనోహర్ శుక్లా(43) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారిపోయింది. వీల్లిద్దరు శారిరకంగా కూడా దగ్గరయ్యారు. అయితే మనోహర్‌కు అప్పటికే వివాహం అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా అతడు ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. నైనా కూడా అతనికి క్రమంగా దగ్గరైంది. ఆ తర్వాత వీళ్లిద్దరు ప్రేమాయణం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వీరి వ్యవహారం ఇరువురు కుటుంబాల సభ్యులకు తెలిసింది. దీంతో ఇప్పటికే వాళ్లను చాలా సార్లు బెదిరించారు. అయినా కూడా వీళ్లు మళ్లీ తమ బంధాన్ని కొనసాగించారు. ఇదిలా ఉండగా ఓ రోజు నైన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కొన్నిరోజుల పాటు చాలాసార్లు ఫోన్ చేసినా కూడా స్విఛాప్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకోని రంగంలోకి దిగారు.
ముందుగా నైనా ఇంటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ దొరికిన సీసీటీవీ ఫొటేజీ పరిశీలించారు. అయితే అందులో మనోహర్‌తో పాటు అతని భార్య సూట్‌కేసుతో బయలుదేరడాన్ని గుర్తించారు. ఇక మనోహర్‌ను అదుపులోకి తీసుకోని విచారించారు. ఈ విచారణలో అతడు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. నైనాతో తన సంబంధం గురించి తన భార్యకు తెలియడంతో అప్పటి నుంచి ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు చెప్పాడు. కానీ ఆమె మాత్రం తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపాడు. తనను పెళ్లి చేసుకోకపోతే మనోహర్‌పై అత్యాచారం కేసు పెడతానని బెదిరిపులకు పాల్పడిందని చెప్పాడు. ఈ క్రమంలోనే తన టార్చర్ భరించలేక నైనాను చంపినట్లు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నైనా డెడ్‌బాడి ఉన్నటువంటి సూట్‌కేసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..