42 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయాడు.. 33 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు.. అసలేం జరిగిందంటే

|

Jun 02, 2023 | 4:58 PM

చిన్నప్పుడు ఎవరైనా తప్పిపోతే కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాల తర్వాత వారి ఆచూకి కనిపిస్తుంది. మరికొందరైతే ఎప్పటికీ అలా కనిపించకుండానే పోతారు. కొంతమంది ముసలివాళ్లు కూడా కొన్ని చోట్ల తప్పిపోతుంటారు.

42 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయాడు.. 33 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు.. అసలేం జరిగిందంటే
Missing
Follow us on

చిన్నప్పుడు ఎవరైనా తప్పిపోతే కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాల తర్వాత వారి ఆచూకి కనిపిస్తుంది. మరికొందరైతే ఎప్పటికీ అలా కనిపించకుండానే పోతారు. కొంతమంది ముసలివాళ్లు కూడా కొన్ని చోట్ల తప్పిపోతుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. అయితే రాజస్థాన్‌లోని ఓ వృద్ధుడు గతంలో కనిపించకుండా పోయి చివరికి 33 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. వివరాల్లోకి వెళ్తే అల్వార్ జిల్లా బన్సూర్ గ్రామానికి చెందిన హనుమాన్ సైనీ అనే 75 ఏళ్ల వృద్ధుడు 1989లో ఢిల్లీలోని ఓ దుకాణంలో పనిలో చేరాడు. అప్పటికి అతని వయసు 42 ఏళ్లు. అయితే అదే సంవత్సరం అతను ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయాడు.

ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ మాతా మందిరంలో పూజలు చేస్తూ గడిపాడు. దాదాపు 33 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలోనే గడిపాడు. చివరికి 75 ఏళ్ల వయసులో అక్కడి నుంచి తన స్వగ్రామమైన బన్సూర్‌కు వచ్చేశాడు. చాలాకాలం తర్వాత హనుమాన్ సైనీ ఇంటికి రావడంతో తన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. చాలా ఏళ్ల తర్వాత పెద్దాయన తిరిగిరావడంతో ఆనందపడిపోయారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే అతను ఇక మళ్లీ ఇంటికి తిరిగిరాలేడని భావించి కుటుంబ సభ్యులు గత ఏడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. అయితే ఎట్టకేలకు అతను తిరిగిరావడంతో సంతోషంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి