Covid: బిల్ గేట్స్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టింది.. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సంచలన ప్రకటన..

సామాజిక కార్యకర్త మేధా పాట్కర్(Medha Patkar ) సంచలన ప్రకటన చేశారు. కరోనా(CORONA) ఆవిర్భవించిందని చెప్పబడుతున్న వుహాన్ ల్యాబ్ ఆ వుహాన్ లేబొరేటరీ(Wuhan Lab) యజమాని బిల్..

Covid: బిల్ గేట్స్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టింది.. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సంచలన ప్రకటన..
Medha Patkar
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 22, 2022 | 9:45 PM

సామాజిక కార్యకర్త మేధా పాట్కర్(Medha Patkar ) సంచలన ప్రకటన చేశారు. కరోనా(CORONA) ఆవిర్భవించిందని చెప్పబడుతున్న వుహాన్ ల్యాబ్ ఆ వుహాన్ లేబొరేటరీ(Wuhan Lab) యజమాని బిల్ గేట్స్(Bill Gates) అని మేధా పాట్కర్ చెప్పారు. చైనాకు చెందిన వుహాన్ ల్యాబొరేటరీ బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు చెందినదని మేధా పాట్కర్ పేర్కొన్నారు. మేధాపాట్కర్ ఈ ప్రకటనకు సంబంధించిన వార్తను ప్రముఖ మరాఠీ వార్తా వెబ్‌సైట్ లోక్‌సత్తా ప్రచురించింది. పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో మేధా పాట్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చెరుకు రైతులకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూణెలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేధా పాట్కర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మేధా పాట్కర్ విలేకరులతో మాట్లాడుతూ.. “కరోనా బయటకు వచ్చిన ల్యాబ్ బిల్ గేట్స్ సొంతమని పేర్కొన్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేసింది. అమెరికాలో రెండు లక్షల 40 వేల ఎకరాల భూమికి యజమాని అయినప్పటికీ భూమిపై దాహం తగ్గలేదు.” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయాన్ని కార్పొరేటీకరణకు ప్లాన్..

ఈ సందర్భంగా రైతుల ఉద్యమం గురించి కూడా మేధా పాట్కర్ ప్రస్తావించారు. రైతుల డిమాండ్లను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ సకాలంలో పట్టించుకోలేదన్నారు. ఈ కారణంగా 715 మంది రైతులు అమరులయ్యారు. అదే తోమర్ ఈరోజు బిల్ గేట్స్ ను ఇండియాకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దీనంతటికీ కారణం వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ పథకమే అని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి: History of Chicken 65: యమ్మీ..యమ్మీ.. చికెన్ 65.. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..

Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..

IND-PAK: స్నేహపూర్వక వాతావరణం కోసం.. ప్రధాని మోడీని టీవీ చర్చకు ఆహ్వానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..