కోట్లాది రూపాయలను ట్రస్టుకు మళ్లించిన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ …ఈడీ
లంచాల రూపంలోనో, బలవంతపు వసూళ్ల ద్వారానో తాను అందుకున్న కోట్లాది రూపాయలను మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన నేతృత్వం లోని చారిటబుల్ ట్రస్టుకు మళ్లించారని ఈడీ అధికారులు వెల్లడించారు,.
లంచాల రూపంలోనో, బలవంతపు వసూళ్ల ద్వారానో తాను అందుకున్న కోట్లాది రూపాయలను మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన నేతృత్వం లోని చారిటబుల్ ట్రస్టుకు మళ్లించారని ఈడీ అధికారులు వెల్లడించారు,. నాగపూర్ లో సాయి శిక్షన్ సంస్థ అనే సంస్థను ను ట్రస్టుగా పేర్కొని తాను దీని చైర్మన్ గా,, తన కుటుంబ సభ్యులను దీనికి వివిధ హోదాల్లో డైరెక్యర్లుగా నియమించి ఈయన కొనసాగుతున్నారని వారు పేర్కొన్నారు. డబ్బుల వసూళ్ల ఆపరేషన్లలో కుందన్ షిండే, సంజీవ్ పలందే అనే వ్యక్తులు కీలక పాత్ర వహించారని ఈడీ తెలిపింది. వీరిలో షిండే… అనిల్ దేశ్ ముఖ్ పర్సనల్ అసిస్టెంట్ కాగా-పలందే పర్సనల్ సెక్రెటరీ అట.. అనిల్ సహా వీరి ఇళ్లపైనా ఈడీ దాడి చేసిన అనంతరం వీరిని అరెస్టు చేసింది. వీరిని కోర్టులో హాజరు పరచగా జులై 1 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది.
ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లను వసూలు చేయాలన్న అనిల్ డిమాండును తీర్చడంలో ఈ ఇద్దరు ముఖ్య పాత్ర వహించినట్టు ఈడీ వెల్లడించింది. వివిధ బార్ల యజమానులు, మేనేజర్ల నుంచి స్టేట్ మెంట్లను తాము రికార్డు చేసినట్టు ఈ సంస్థ పేర్కొంది. ఈ వసూళ్ల వ్యవహారంలో అప్పటి పోలీసు అధికారి సచిన్ వాజే కూడా మరింత కీలక పాత్ర వహించినట్టు ఆరోపణలు రాగా జాతీయ భద్రతా సంస్థ ఆయనను అరెస్టు చేసిన విషయం గమనార్హ్జం. 2020 డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలం వరకు వాజే అక్రమంగా రూ. 4.70 కోట్లు వసూలు చేసినట్టు ఈడీ అధికారులు చెప్పారు.
ఈ మొత్తాన్ని సచిన్ రెండు విడతలుగా షిండే., పలందేలకు ఇచ్చారట. వీరి నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Coconut Sweet: ఐరెన్ లోపంతో బాధపడుతున్నారా కొబ్బరి స్వీట్ తింటే సరి.. కోనసీమ స్టైల్ లో తయారీ ఎలా అంటే
INDW vs ENGW 1st ODI Preview: ఇంగ్లండ్‌తో భారత మహిళల పోరు; నేడు బ్రిస్టల్ మొదటి వన్డే