Coconut Sweet: ఐరెన్ లోపంతో బాధపడుతున్నారా కొబ్బరి స్వీట్ తింటే సరి.. కోనసీమ స్టైల్ లో తయారీ ఎలా అంటే

Coconut Sweet: పచ్చి కొబ్బరి తో రైస్ , పచ్చడి, కూరలు చేసుకోవడమే కాదు.. స్వీట్స్ కూడా చేస్తారు. ముఖ్యంగా కోనసీమలో పచ్చి కొబ్బరితో స్వీట్స్ చేస్తారు. ఈరోజు కోనసీమ స్టైల్ లో..

Coconut Sweet: ఐరెన్ లోపంతో బాధపడుతున్నారా కొబ్బరి స్వీట్ తింటే సరి.. కోనసీమ స్టైల్ లో తయారీ ఎలా అంటే
Coconut Sweet
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2021 | 11:07 AM

Coconut Sweet: పచ్చి కొబ్బరి తో రైస్ , పచ్చడి, కూరలు చేసుకోవడమే కాదు.. స్వీట్స్ కూడా చేస్తారు. ముఖ్యంగా కోనసీమలో పచ్చి కొబ్బరితో స్వీట్స్ చేస్తారు. ఈరోజు కోనసీమ స్టైల్ లో కొబ్బరి స్వీట్ లేదా కొబ్బరుండలు తయారు చేయడం ఈరోజు తెలుసుకుందాం..

కావలిసిన పదార్ధాలు :

పచ్చి కొబ్బరి తురుము 4 కప్పులు బెల్లం 2 కప్పులు తురిమిడింది (అప్షనల్ గా పంచదార కూడా వేసుకోవచ్చు) నెయ్యి స్వీట్ తయారీకి కావాల్సినంత యాలకుల పొడి.. 1 టీ స్పూన్

తయారు చేయు విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి బాణలిలో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కొబ్బరి తురుము పచ్చి కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించాలి. . తరువాత బెల్లం తురుము ని ( లేదా పంచదార) వేసి కలియబెట్టాలి. అనంతరం బెల్లం బాణలి అడుగంటకుండా కలియ పెడుతూ ఉండాలి.. పాకం తయారై గట్టి పడుతున్నట్లుగా అనిపించినపుడు నెయ్యి వేసి కలియ తిప్పాలి.. కావాలనుకున్న వారు యాలకుల పొడి వేసుకోవాలి.. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రే లో వేసి సమంగా పరచాలి.. వేడిగా ఉన్నపుడే బిళ్ళల మాదిరి కట్ చేస్తే చల్లారాక విరిగిపోకుండా తీయవచ్చు.. ఇదే మిశ్రమాన్ని కావన్న వారు ఉండాలి రూపం లో చేసుకోవచ్చు.. చలికాలం కొబ్బరి తీసుకోవటం చాలా మంచిది.. చర్మం పగలకుండా తోడ్పడుతుంది.. వీలైన్నతవరకు బెల్లంతో చేసుకోండి.. ఐరన్ లోపం ఉన్నవారు బెల్లంతో చేసిన కొబ్బరి స్వీట్ ను తింటే సమస్య తగ్గుతుంది.

Also Read: రోజూ మునగాకు రసం తీసుకోండి.. షుగ‌ర్, క్యాన్స‌ర్‌ల‌కు చెక్‌ పెట్టండి