Road Accident : అదుపుతప్పి వాహనం బోల్తా.. ఏడుగురు మృతి..

మహారాష్ట్ర యావత్‌మాల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును తప్పించే క్రమంలో ఓ వాహనం అదుపుతప్పి బోల్లా కొట్టింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని కలంబ్-జోడ్మోహా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే వీరంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వారిగా గుర్తించారు. వార్దా జిల్లాలోని కోటేశ్వర్ […]

Road Accident : అదుపుతప్పి వాహనం బోల్తా.. ఏడుగురు మృతి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 1:19 AM

మహారాష్ట్ర యావత్‌మాల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును తప్పించే క్రమంలో ఓ వాహనం అదుపుతప్పి బోల్లా కొట్టింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని కలంబ్-జోడ్మోహా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

అయితే వీరంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వారిగా గుర్తించారు. వార్దా జిల్లాలోని కోటేశ్వర్ ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరి సమీప బంధువు ఒకరు మృతిచెందగా..అక్కడికి వెళ్లే క్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.