వామ్మో.. ఇంతటి ఆటవిక చర్యలా.. ఆవుదూడను చంపావంటూ.. అందుకు కూతుర్ని..!
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చట్టాల్ని పక్కన పెట్టి.. తాము చెప్పిందే శాసనమన్నట్లు ప్రవర్తిస్తున్నారు అక్కడి గ్రామ పంచాయితీ పెద్దలు. ఇటీవల ఓ లేగదూడ ప్రమాదవశాత్తు మృతిచెందింది. అయితే దానికి కారణం ఓ వ్యక్తి అంటూ.. ఆయనకు విచిత్రమైన శిక్ష విధించారు. అది కూడా సభ్య సమాజం తలదించుకునే శిక్ష విధించారు. తన సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాలంటూ సదరు గ్రామ పంచాయితీ పెద్దలు ఆదేశించారు. లేగదూడను చంపిన పాపానికి ఇలా చేస్తే.. ప్రాయశ్చిత్తం కలుగుతుందంటూ సదరు బాధితుడికి […]
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చట్టాల్ని పక్కన పెట్టి.. తాము చెప్పిందే శాసనమన్నట్లు ప్రవర్తిస్తున్నారు అక్కడి గ్రామ పంచాయితీ పెద్దలు. ఇటీవల ఓ లేగదూడ ప్రమాదవశాత్తు మృతిచెందింది. అయితే దానికి కారణం ఓ వ్యక్తి అంటూ.. ఆయనకు విచిత్రమైన శిక్ష విధించారు. అది కూడా సభ్య సమాజం తలదించుకునే శిక్ష విధించారు. తన సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాలంటూ సదరు గ్రామ పంచాయితీ పెద్దలు ఆదేశించారు. లేగదూడను చంపిన పాపానికి ఇలా చేస్తే.. ప్రాయశ్చిత్తం కలుగుతుందంటూ సదరు బాధితుడికి సెలవిచ్చారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా పతారియాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తన బైక్‌పై వెళ్తుండగా దూడ అడ్డం వచ్చింది. దీంతో బైక్ అదుపు తప్పి ఆ దూడను ఢీకొట్టింది. దీంతో ఆ దూడ మరణించింది. అయితే సదరు లేగదూడ మృతికి అతడే కారణమని గ్రామ పంచాయతీ పెద్దలు తీర్మానం చేశారు. అంతేకాదు దూడ మరణానికి పరిహారం కూడా చేసుకోవాలని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్ వెళ్లి గంగానదిలో స్నానం చేసి వచ్చాడు. అనంతరం ఊరి వాళ్లందరికీ అన్నదానం చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఇది అంతా పట్టించుకోని పంచాయతీ పెద్దలు.. పంచాయితీని పెద్దది చేసేలా ప్లాన్ వేశారు. అన్నదానం కాదు..నీ సొంత మైనర్ బిడ్డనే పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశించారు. అందుకు అనుగుణంగా పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే విషయం గురించి కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో.. వెంటనే పోలీసులు సదరు గ్రామంలోకి ఎంటర్ అయ్యారు.
మైనర్‌కు పెళ్లి చేయడం నేరమని పోలీసులు, అధికారులు చెప్పినా పంచాయతీ పెద్దలు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు ఆ అమ్మాయి ఆధార్ కార్డు తెప్పించి చూసి ఆమె వయస్సు 14 సంవత్సరాలుగా నిర్ధారించారు. మైనర్‌కు పెళ్లి చేయవద్దని తల్లిదండ్రులను, గ్రామపెద్దలను గట్టిగా హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై ఎవరిపై కూడా కేసులు నమోదు కాలేదు.