కోవిడ్ సెకండ్ వేవ్ ప్రబలడానికి మీదే బాధ్యత, ఈసీపై నిప్పులు చెరిగిన మద్రాస్ హైకోర్టు

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రబలడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) దే పూర్తి బాధ్యత అని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు మీపై బహుశా హత్యాభియోగం కింద కేసు పెట్టవచ్చు అని వ్యాఖ్యానించింది.

  • Publish Date - 3:39 pm, Mon, 26 April 21 Edited By: Phani CH
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రబలడానికి మీదే బాధ్యత, ఈసీపై నిప్పులు చెరిగిన మద్రాస్ హైకోర్టు
Madras High Court

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రబలడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) దే పూర్తి బాధ్యత అని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు మీపై బహుశా హత్యాభియోగం కింద కేసు పెట్టవచ్చు అని వ్యాఖ్యానించింది. ఓ వైపు కోవిడ్ కేసులు పెరుగుతుండగా మరో వైపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టి ప్రజల సమూహాలు వెల్లువెత్తడానికి మీరు కారకులయ్యారని పేర్కొంది. కోవిడ్ ప్రోటోకాల్ కు సంబంధించి ఓ ‘బ్లూ ప్రింట్’ (ప్లాన్ ) ను సమర్పించకపోతే వచ్చే ఆదివారం ఎన్నికల ఫలితాల లెక్కింపును నిలిపివేస్తామని హెచ్చరించింది.  రెండో కోవిడ్ వ్యాపించడానికి పూర్తిగా మీ అధికారులదే బాధ్యత.. బహుశా హత్యాభియోగంపై వారిపై కేసు పెట్టవచ్చు అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారాల సందర్భంగా మాస్క్, శానిటైజర్లు, భౌతిక దూరం పాటింపు వంటి కోవిడ్ సేఫ్టీ రూల్స్ ని అమలు చేయడంలో ఈసీ విఫలమైందని మద్రాస్ హైకోర్టు ఆరోపించింది.

ఎన్నిల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు ఈ భూగ్రహం పై కాక మరో గ్రహంలో ఉన్నారా అని చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజల మనుగడ, రక్షణ అన్నదే ముఖ్యమని, వీటి తరువాతే ఏదైనా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ శుక్రవారం లోగా ఒక ప్లాన్ అంటూ అమలు చేయాలనీ, లేని పక్షంలో మే 2 న ఫలితాల ప్రకటనను నిలిపివేస్తామని ఆయన అన్నారు. ప్రజారోగ్యం అన్నది చాలా ముఖ్యమని, దీన్ని రాజ్యాంగ సంస్థల అధికారులకు గుర్తు చేయవలసి రావడం బాధాకరం అని కోర్టు పేర్కొంది. ఒక పౌరుడు బతికి ఉంటేనే ప్రజాస్వామ్య రిపబ్లిక్ హక్కులనుపొందగలుగుతాడని వ్యాఖ్యానించింది. ఈసీ, తమిళనాడు చీఫ్ ఎలెక్షన్ కమిషన్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి ఆరోగ్య శాఖ కార్యదర్శిని  సంప్రదించాలని, ఓట్ల  లెక్కింపు రోజుకు గాను కోవిడ్-19 ప్రోటోకాల్ ను రూపొందించి దాన్ని ఈ నెల 30 న సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తాను పోటీ చేస్తున్న కరూర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రంలో కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించేలా చూడాలంటూ తమిళనాడు రవాణా శాఖ మంత్రి విజయభాస్కర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బెంగాల్ లో మరో మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా రోడ్ షోలను, బైక్ ర్యాలీలను ఈసీ నిషేధించింది. చివరి మూడు దశల ఎన్నికలను కలిపి ఒకేసారి నిర్వహించాలన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యర్థనను ఈసీ తిరస్కరించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Pelli Sandadi 2: ఆ రోజునే దర్శకేంద్రుడి కొత్త పెళ్లి ‘సందడి’ మొదలయ్యేది..  డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. 

West Bengal Election 2021 Phase 7 Voting LIVE: ప్రశాంతంగా ఏడో విడత పోలింగ్.. మధ్యాహ్నం 1:32 వరకు 55.12 శాతం పోలింగ్