మహిళపై తాంత్రికుడి అత్యాచారం.. ఆ తర్వాత భర్తకు అప్పగింత.. విషయం తెలిస్తే షాక్..

త్రిపుల్ తలాఖ్ పేరుతో ఇంకా ఆటవిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపుల్ తలాఖ్‌పై చట్టం వచ్చినా కూడా.. ఇంకా ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన.. ఇప్పుడు సంచలనంగా మారింది. కుటుంబంలో వచ్చిన చిన్న తగాదాల విషయంలో.. ఓ వ్యక్తి తన భార్యకి త్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. అయితే ఈ దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తానంటూ ఓ తాంత్రికుడు ఎంటర్ అయ్యాడు. మీ మధ్య ఉన్న వివాదాన్ని తీర్చేస్తానంటూ.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:16 am, Thu, 12 December 19
మహిళపై తాంత్రికుడి అత్యాచారం.. ఆ తర్వాత భర్తకు అప్పగింత.. విషయం తెలిస్తే షాక్..

త్రిపుల్ తలాఖ్ పేరుతో ఇంకా ఆటవిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపుల్ తలాఖ్‌పై చట్టం వచ్చినా కూడా.. ఇంకా ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన.. ఇప్పుడు సంచలనంగా మారింది. కుటుంబంలో వచ్చిన చిన్న తగాదాల విషయంలో.. ఓ వ్యక్తి తన భార్యకి త్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. అయితే ఈ దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తానంటూ ఓ తాంత్రికుడు ఎంటర్ అయ్యాడు. మీ మధ్య ఉన్న వివాదాన్ని తీర్చేస్తానంటూ.. తాంత్రికుడు సదరు వ్యక్తికి తన భార్యను హలాలాకు పంపాలంటూ కోరాడు. అయితే తాంత్రికుడి మాటలు విన్న ఆ ప్రబుద్ధుడు.. తన భార్యను తాంత్రికుడి ప్లాట్‌కి పంపాడు. ఆ తర్వాత ఆ తాంత్రికుడు హలాలా పేరుతో అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆ మహిళను తన భర్తకు అప్పగించాడు.

అయితే హలాలా అయిన భార్యతో కాపురం చేసేందుకు నిరాకరించాడు .దీంతో మోసపోయిన సదరు మహిళ.. భర్తపై, తాంత్రికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో నిందితులిద్దిరినీ పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.