AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panna: అదృష్టం అంటే ఈ రైతుదే.. లీజు తీసుకున్న గనిలో వరసగా రెండో వజ్రం లభ్యం.. ధర తెలిస్తే షాక్..

ఈ దంపతులకు ఇదే ప్రదేశంలో కొన్ని వారల క్రితం కూడా చాలా చిన్న వజ్రం లభించింది. కొంతకాలం క్రితం నుంచి బజారియా గ్రామంలో దంపతులు లీజుకు తీసుకున్న భూమిలో వజ్రాల అన్వేషణ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న ఈ దంపతులకు ఎట్టకేలకు నిన్న గులకరాళ్లు, మట్టితో పాటు మెరుస్తున్న రాయి కనిపించింది. దీనిని జాగ్రత్తగా తవ్వి వెలికి తీయండతో ఈ దంపతుల ప్రయత్నాలు ఫలించాయి.

Panna: అదృష్టం అంటే ఈ రైతుదే.. లీజు తీసుకున్న గనిలో వరసగా రెండో వజ్రం లభ్యం.. ధర తెలిస్తే షాక్..
Panna Farmer
Surya Kala
|

Updated on: Jun 24, 2024 | 11:10 AM

Share

లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు.. ఇంకా చెప్పాలంటే అదృష్ట వంతుడిని పాడు చేసేవాడు లేడు దురదృష్ట వంతుడిని బాగు చేసేవాడు లేడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయన్ని అప్పుడప్పుడు నమ్మాల్సిందే ని కొన్ని కొన్ని సంఘటలు వెలుగులోకి వచ్చి నిరూపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ రైతు ఇంట కాసుల వర్షం కురిసింది. లీజుకు తీసుకున్న భూమిలో విలువైన రాయి దొరికింది. ఈ డైమండ్ విలువ లక్షల్లో ఉన్నట్లు అంచనావేస్తున్నారు. అవును వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఓ రైతును ఓ వజ్రం మరోసారి ధనవంతుడిని చేసింది. తాను లీజుకి తీసుకున్న గనిలో దొరికిన వజ్రంతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు ఆ రైతు. ఇప్పుడు ఆ రైతు ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని గౌరేయ కకర్రాహతి గ్రామానికి చెందిన దేశ్‌రాజ్ ఆదివాసీ దంపతులకు శుక్రవారం 6.65 క్యారెట్ల వజ్రం లభించింది. ఈ వజ్రం దాదాపు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దంపతులకు ఇదే ప్రదేశంలో కొన్ని వారల క్రితం కూడా చాలా చిన్న వజ్రం లభించింది. కొంతకాలం క్రితం నుంచి బజారియా గ్రామంలో దంపతులు లీజుకు తీసుకున్న భూమిలో వజ్రాల అన్వేషణ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న ఈ దంపతులకు ఎట్టకేలకు నిన్న గులకరాళ్లు, మట్టితో పాటు మెరుస్తున్న రాయి కనిపించింది. దీనిని జాగ్రత్తగా తవ్వి వెలికి తీయండతో ఈ దంపతుల ప్రయత్నాలు ఫలించాయి.

విభిన్నంగా కనిపించే గులకరాయిని చూసి.. దాని మీద దుమ్మును తొలగించిన తర్వాత ఆ దంపతులు చాలా సంతోషించారు. దుమ్మును తొలగించిన తర్వాత ఆ రాయి మెరిసిపోవడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. దేశ్‌రాజ్ ఆ రాయిని పన్నాలోని డైమండ్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఉంచాడు. వజ్రం ఇప్పుడు వేలం వేయబడుతుంది. పన్ను మినహాయింపు తర్వాత అతను ధరను పొందుతాడని.. త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో ఈ వజ్రాన్ని ఉంచుతామని పన్నా డైమండ్‌ ఆఫీసు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

దేశ్‌రాజ్‌కి ఇది మొదటి సారి కలిగిన అదృష్టం కాదు. గత కొన్ని వారాల క్రితం అతను అదే స్థలంలో 1.35 క్యారెట్ వజ్రాన్ని కనుగొని డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేశాడు. ఈసారి అతను పెద్దదైన, ఖరీదైన రాయిని పొందాడు. వేలంలో ఈ వజ్రం సుమారు రూ.25 లక్షల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

మరిని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?