AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరుకే వరల్డ్ నెం.1.. అందులో జీరో! తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ మన టీమిండియాలోని అసమతుల్యతను స్పష్టం చేశాయి. ప్రపంచ నంబర్ వన్ జట్టుగా ఉన్నా, బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్ 4లో ఆధిపత్యం చెలాయించారు. అయితే, బౌలింగ్ విభాగంలో మాత్రం టాప్ 10లో ఒక్క భారత బౌలర్ కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

పేరుకే వరల్డ్ నెం.1.. అందులో జీరో! తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
Icc Odi Rankings Team India
SN Pasha
|

Updated on: Jul 22, 2026 | 5:48 PM

Share

తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ మన టీమిండియాలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. బ్యాటింగ్ విభాగంలో టాప్ 4లో ముగ్గురు ఆటగాళ్లు మనోళ్లే ఉంటే, బౌలింగ్‌లో మాత్రం టాప్ 10లో ఒక్కరు కూడా లేరు. ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్‌గా ఉన్న టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్ 10లో లేకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

టాప్ 10లో ఎవరున్నారు..?

వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఐదు వికెట్లు తీసి మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ స్పిన్నర్ గుడకేష్ మోతీ ఏడు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి ప్రవేశించగా, అల్జారీ జోసెఫ్ 26వ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ 29వ స్థానానికి చేరుకోగా, భారత్‌కు చెందిన అక్షర్ పటేల్ 10 స్థానాలు మెరుగుపడి సంయుక్తంగా 32వ స్థానంలో నిలిచాడు. దీంతో భారత బౌలింగ్ విభాగం బలహీనత మరోసారి వెలుగులోకి వచ్చింది.

బ్యాటింగ్‌లో బెటర్..

అయితే బ్యాటింగ్‌లో మాత్రం భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 188 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్, ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-1 స్థానానికి కేవలం ఒక రేటింగ్ పాయింట్ దూరంలో నిలిచాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, గిల్ 801 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి వన్డేలో సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లీ 767 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. టాప్-4లో ముగ్గురు భారత బ్యాటర్లు ఉండటం భారత బ్యాటింగ్ బలాన్ని మరోసారి నిరూపించింది.

ఇంగ్లండ్ స్టార్ జో రూట్ కూడా ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో నాలుగు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. బెన్ డకెట్, జాకబ్ బెథెల్ కూడా ర్యాంకింగ్స్‌లో గణనీయంగా మెరుగుపడ్డారు. మరోవైపు, వెస్టిండీస్‌పై రాణించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే అత్యుత్తమమైన మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానంలో, మెహిదీ హసన్ మీరాజ్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే