AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు బిగ్‌షాక్.. ఆగస్ట్‌ ఫస్ట్‌ నుంచి అవి లేకుండా బంక్‌లోకి వెళ్తే.. నో పెట్రోల్‌!

రోజురోజుకు రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గట్లేదు. ఇటీవల తాజాగా జరిగిన సర్వే ప్రకారం రోజుకు సగటున 16 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లోనే మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్స్‌ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్‌ ధరించకపోవడమేనని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందేంటో తెలుసుకుందాం పదండి.

వాహనదారులకు బిగ్‌షాక్..  ఆగస్ట్‌ ఫస్ట్‌ నుంచి అవి లేకుండా బంక్‌లోకి వెళ్తే.. నో పెట్రోల్‌!
No Helmet No Petrol
Anand T
|

Updated on: Jul 30, 2025 | 11:00 PM

Share

అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్స్‌ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్‌ ధరించకపోవడమేనని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ‘నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా పెట్రోలు బంకులకు వచ్చే ద్విచక్ర వాహనాలకు ఇంధనం పోయొద్దని బంక్‌ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేఫథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మొదటగా ఇండోర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేయనుంది. హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనదారులు, సీట్‌బెల్ట్‌ లేకుండా కారులో ప్రయాణించే వారు పెట్రోల్‌ బంక్‌లోకి వస్తే వారికి ఇందనం పోయవద్దని జిల్లా మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించని పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆదేశాలు పాటించని వారికి ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.5వేల ఫైన్‌ వేయనున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.