Madhya Pradesh: కరోనా మరణాలను ఎవరూ ఆపలేరు…మంత్రి వెటకారపు మాటలపై వివాదం!

ఒక్కోసారి వ్యవస్థల మీద పిచ్చకోపం వచ్చేస్తుంది ఇలాంటి వాళ్ళను చూస్తె. అసలు ఏం మాట్లాడుతారో.. ఎందుకు మాట్లాడుతారో.. అలా ఎలా మాట్లాడాలనిపిస్తుందో అర్ధంకాదు.

Madhya Pradesh: కరోనా మరణాలను ఎవరూ ఆపలేరు...మంత్రి వెటకారపు మాటలపై వివాదం!
Madhya Pradesh
Follow us
KVD Varma

|

Updated on: Apr 15, 2021 | 5:30 PM

Madhya Pradesh: ఒక్కోసారి వ్యవస్థల మీద పిచ్చకోపం వచ్చేస్తుంది ఇలాంటి వాళ్ళను చూస్తె. అసలు ఏం మాట్లాడుతారో.. ఎందుకు మాట్లాడుతారో.. అలా ఎలా మాట్లాడాలనిపిస్తుందో అర్ధంకాదు. ఓట్లేసిన ప్రజలు వెర్రోళ్ళు అని బాగా ఫిక్స్ అయిపోతారేమో.. క్లిష్టపరిస్తితిల్లో ప్రజలకు కష్టం కలిగేలా మాట్లాడతారు. ఎందుకిదంతా అంటే.. ఈయనగారి పేరు ప్రేమ్ సింగ్.. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి. పేరులోనే ప్రేమ ఉంది.. నోరువిప్పితే అయ్యబాబోయ్ అనాల్సిందే. కరోనా ఒక పక్క ప్రజల బతుకుల్ని చిన్నాభిన్నం చేసేస్తోంది..కోవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ మంత్రిగారు ఏమన్నారో వింటే మీరుకూడా షాక్ అయితీరుతారు. ”ఎవరూ ఈ మరణాలను ఆపలేరు. కరోనా నుంచి రక్షణ కల్పించాలని.. సహకారం కావాలని మాట్లాడుతున్నారు అందరూ. ప్రతిరోజూ చాలామంది చనిపోతున్నారని మీరు చెబుతున్నారు. ఎవరన్నా చనిపోవాల్సిందే. ముసలివాళ్ళు అవుతారు చచ్చిపోతారు. దానిని ఎవరు ఆపగలరు” అంటూ సదరు మంత్రిగారు విలేకరుల సమావేశంలోనే చెప్పుకొచ్చారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి.. ప్రజలు కష్టంలో ఉంటె వారికీ మేలు చేయడం ఎలా అని ఆలోచించాల్సిన ఈ మంత్రి ఇలా మాట్లాడటంతో అందరూ అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఈయనగారి మాటలు వైరల్ గా మారాయి. అంతేకాదు..మంత్రి ప్రేమ్ సింగ్ పెలాపనపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఆయన ఇంకా చాలా అన్నారు..

మంత్రి ప్రేమ్ సింగ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే మీరూ వినండి..

ఇదిలా ఉండగా దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. భారతదేశంలో నమోదవుతోన్న కరోనా కేసులు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ఒక్కరోజులోనే నమోదైన కరోనా కేసుల సంఖ్య ఏకంగా రెండు లక్షలు దాటింది.  బుధవారం నాటి  ఒక లక్షా 99 వేల 376 రికార్డును చెరిపేసి ఇవాళ ఏకంగా 2 లక్షల 739 కేసులతో దేశంలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది కోవిడ్ మహమ్మారి.

Also Read: భారత్‌లో 14 వందల ఏళ్ల కిందటే మసీదు రూపుదిద్దుకుంది. ఆ చారిత్రక మసీదు ఎక్కడుందో తెలుసా?

Bank Privatisation: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ.. లిస్ట్ ఫైనల్ అయినట్లేనా..!