భారత్‌లో 14 వందల ఏళ్ల కిందటే మసీదు రూపుదిద్దుకుంది. ఆ చారిత్రక మసీదు ఎక్కడుందో తెలుసా?

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమయ్యింది. మసీదులలో ప్రత్యేక తరావీ ప్రార్థనలు మొదలయ్యాయి. మసీదులు కొత్త కాంతులను అద్దుకున్నాయి.. అసలు మన దేశంలో వెలసిన మొట్టమొదటి మసీదు ఎక్కడుందో తెలుసా? ఎన్ని ఏళ్ల కిందట ఆ మసీదు రూపుదిద్దుకున్నదో తెలుసా?

భారత్‌లో 14 వందల ఏళ్ల కిందటే మసీదు రూపుదిద్దుకుంది. ఆ చారిత్రక మసీదు ఎక్కడుందో తెలుసా?
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 15, 2021 | 12:08 PM

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమయ్యింది. మసీదులలో ప్రత్యేక తరావీ ప్రార్థనలు మొదలయ్యాయి. మసీదులు కొత్త కాంతులను అద్దుకున్నాయి.. అసలు మన దేశంలో వెలసిన మొట్టమొదటి మసీదు ఎక్కడుందో తెలుసా? ఎన్ని ఏళ్ల కిందట ఆ మసీదు రూపుదిద్దుకున్నదో తెలుసా?

ఇస్లాం పుట్టిన తొలినాళ్లలోనే భారత్‌లో ఆ మతం అడుగుపెట్టింది.. 14 వందల ఏళ్ల కిందటే భారత్‌లో మసీదు వెలిసిందంటే ఆశ్చర్యమనిపిస్తుంది. అసలు ప్రపంచంలో అత్యంత పురాతనమైన మసీదుల లిస్టు తీస్తే భారత్‌లో ఉన్న మసీదు రెండో స్థానంలో ఉంటుంది. ఆ లెక్కన ఎంత ప్రాచీనమైనదో అర్థమవుతుంది. కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో కొండంగళూరు అనే చిన్న పట్టణం ఉంది. మలబార్‌ తీరంలో ఉన్న ఈ ప్రార్థనమందిరం పేరు చేరామన్‌ జమా మసీదు. క్రీస్తుశకం 629లో నిర్మించిన ఈ మసీదు భారతదేశంలోనే మొట్టమొదటిది. మాలిక్‌ బిన్‌ దీనార్‌ ఈ మసీదు నిర్మాణకర్త.

ఈ ప్రార్థనమందిర నిర్మాణంపై హిందూమత ప్రభావం కనిపించడం విశేషం. కొన్ని వందల ఏళ్లుగా ఈ మసీదులోని దీపం అఖండంగా వెలుగుతూ ఉంది. క్రీస్తుశకం 1341లో వచ్చిన వరద ఈ మసీదును చాలా వరకు ధ్వంసం చేసిందట! అటు పిమ్మట ఈ మసీదును పునర్నిర్మించారు. ఫలానా మతంవారే మసీదులోకి రావాలన్న రూలేమీ లేదు. ఎవరైనా వెళ్లొచ్చు. దీపాన్ని వెలిగించవచ్చు. ఇస్లాం పుట్టిన కొత్తల్లోనే మలబార్‌ ప్రాంత రాజు చేరామన్‌ పెరుమాళ్‌ ఆ మతాన్ని స్వీకరించారట! మక్కాను కూడా సందర్శించి మహ్మద్‌ ప్రవక్తను కలుసుకున్నాడట! చేరామన్‌ పెరుమాళ్‌కు అక్కడ మల్కిబిన్‌ దీనార్‌… మల్కిబిన్‌ హబీబ్‌లు పరిచయమయ్యారు! వారిని కేరళకు ఆహ్వానించి. కేరళలో ఇస్లాం మత అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరారు.

చేరామన్‌ ఆహ్వానం మేరకు క్రీస్తుశకం 629లో వారు కేరళకు వచ్చి చేరామన్‌ జుమా మసీదును నిర్మించారని చెబుతుంటారు. గతంలో ఇది బౌద్ధ ఆరామమనీ, బౌద్ధులు ఈ మందిరాన్ని అరబ్బులకు కానుకగా ఇచ్చారనీ, ఆ తర్వాతే ఇది మసీదుగా మారిందని కొందరంటుంటారు. ఈ ప్రాచీన మసీదును సందర్శించడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మసీదులోని దీపపు ఇత్తడి సెమ్మలను చూస్తే ఇది గుడా ? మసీదా ? అన్న అనుమానం కలగకుండా మానదు! ఇక మసీదులోపల అద్భుతమైన నగిషీలతో ఉన్న వేదిక ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పూర్తిగా రోజ్‌వుడ్‌తో ఈ వేదికను నిర్మించారు. ఇందులో ఉన్న పాలరాయి ముక్కను మక్కా నుంచి తెచ్చారట! పవిత్ర రంజాన్‌ మాసంలో ఈ మసీదు కొత్త అందాలను సంతరించుకుంటుంది. సందర్శకుల తాకిడి కూడా పెరుగుతుంది.

ఇంచుమించు ఇంతే పురాతనమైన మసీదు ఒకటి తమిళనాడులో ఉంది. కిలకరైలో ఉన్న ఈ మసీదును కూడా క్రీస్తుశకం 630లో నిర్మించి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. పాత జుమా మసీదుగా పేరొందిన ఈ ప్రార్థనమందిరాన్ని మీన్‌కడై పల్లిగా కూడా పిలుచుకుంటారు స్థానికులు. దక్షిణభారత దేశంలో ఉన్న ప్రసిద్ధ తీర ప్రాంతాలలో కిలకరై ఒకటి. ఈ మందిరాన్ని క్రీస్తుశకం 630లో నిర్మించినప్పటికీ 1036లో పునర్నిర్మాణం జరిగింది. ద్రవిడియన్‌ ఇస్లామ్‌ ఆర్కిటెక్చర్‌కు ఈ కట్టడానికి మించిన ఉదాహరణ ఉండదు. అప్పట్లో వాణిజ్యం కోసం యెమన్‌ వర్తకులు వచ్చేవారు. అలా వచ్చిన ఓ యెమన్‌ వ్యాపారి మాలిక్‌ ఇబ్‌ దినార్‌ నిర్మించిన మసీదు ఇది! అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పాండ్య రాజు మసీదు కట్టుకోవడానికి అనుమతిని, కానుకగా భూమిని ఇచ్చాడు. ఆ రాజు ఇస్లాం మతం స్వీకరించాడనీ, ఆయన సోదరి మాలిక్‌ దినార్‌ను వివాహం చేసుకున్నదని కొందరు చెబుతుంటారు. అయితే దీనికి తగిన చారిత్రక ఆధారాలు లేవు. మసీదు నిర్మాణం అచ్చంగా హిందూ దేవాలయంలాగే ఉంటుంది.. రాతి స్తంభాలపై ఎలాంటి మూర్తులను చెక్కకపోయినా .. స్తంభాల నిర్మాణశైలి మాత్రం దేవాలయాల స్తంభాలను పోలి ఉంటుంది. అప్పట్లో ఈ మసీదు చిన్నగానే ఉండింది. పాత మసీదును ఆనుకుని కొత్తగా ఓ మసీదును విశాలంగా నిర్మించారు.

మరిన్ని ఇక్కడ చదవండి: Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు.. కేసులోని సెక్షన్లు ఇవే

కరోనా విలయతాండవం…ఢిల్లీ, ముంబైలలో తాత్కాలిక ఆస్పత్రులుగా స్టార్ హోటళ్లు