Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.90 వేల కోసం దారుణ హత్య: మేనమామను చంపి.. ఆరు ముక్కలుగా నరికి..

అవసరమని మేనమామ వద్ద డబ్బు తీసుకున్నాడో వ్యక్తి. ఆ తర్వాత ఆదుకున్న మేనమామనే దారుణంగా హతమార్చి ముక్కలుగా నరికి పాతేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల..

రూ.90 వేల కోసం దారుణ హత్య: మేనమామను చంపి.. ఆరు ముక్కలుగా నరికి..
Vivek Sharma
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 18, 2023 | 7:36 AM

భోపాల్‌, జులై 18: అవసరమని మేనమామ వద్ద డబ్బు తీసుకున్నాడో వ్యక్తి. ఆ తర్వాత ఆదుకున్న మేనమామనే దారుణంగా హతమార్చి ముక్కలుగా నరికి పాతేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గుణ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త వివేక్ శర్మ (45) అదే జిల్లాలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న మేనల్లుడు మోహిత్‌కు కొన్ని నెలల క్రితం రూ.90 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పుగా ఇచ్చిన సొమ్మును అడిగేందుకు జులై 12న మోహిత్‌ ఇంటికి వెళ్లాడు వివేక్‌. అప్పు చెల్లించడం ఇష్టంలేని మోహిత్‌ టీలో డ్రగ్స్‌ కలిపి మామకు ఇచ్చాడు. వివేక్‌ ఆ టీ తాగగానే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అనంతరం వివేక్‌ను హత్య చేసి, శరీర భాగాలను కత్తితో ఆరు ముక్కలుగా నరికి పాలిథిన్ సంచుల్లో కుక్కాడు మోహిత్‌. ఆ సంచులను గోపీకృష్ణ సాగర్ డ్యామ్ సమీపంలోని గొయ్యిలో పాతిపెట్టి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చాడు. మోహిత్‌ ఇంటికి వెళ్లిన వివేక్‌ ఎంతకీ తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు వివేక్‌ చివరిగా మోహిత్‌ ఇంటికి వెళ్లాడని తెలుసుకుని అతన్ని ప్రశ్నించారు. ఐతే తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించినా తర్వాత నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు ఘటనా స్థలంలో తవ్వి వివేక్ మృతదేహాన్ని వెలికి తీశారు. వివేక్‌ తల శరీరం నుంచి వేరుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి చేతివేళ్లకున్న ఉంగరం ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీల విషయమై వివేక్ తరచూ మోహిత్ ఇంటికి వచ్చేవాడని, ఈ క్రమంలోనే మోహిత్‌ హత్యకు పాలపడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.