Lockdown News: కరోనా ఉధృతి…ఆ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో లాక్‌డౌన్

Covid-19 Lockdown News: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో... పరిస్థితి చేయిదాటి పోకుండా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

Lockdown News: కరోనా ఉధృతి...ఆ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో లాక్‌డౌన్
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 08, 2021 | 12:56 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో… పరిస్థితి చేయిదాటి పోకుండా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేయనుంది. శుక్రవారం సాయంత్రం 6 గం.ల నుంచి సోమవారం ఉదయం 6 గం.ల వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో కరోనా ఉధృతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం(క్రైసిస్ మీట్) అనంతరం ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు ప్రకటించారు. కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాల్లో కంటైన్మెంట్ ఏరియా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీకెండ్‌లో జనసంచారం పెరిగి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే ముప్పు ఉండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో గురువారంనాడు రికార్డు స్థాయిలో 1,26,789 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,29,28,574కు చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా మేరకు యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షల మార్క్‌ను అధిగమించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో లక్నో, వారణాసి, కాన్పూర్‌లలో ఇవాళ్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..Telangana High Court: కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Corona Effect: కరోనా ప్రభావం మళ్లీ మొదలైందిగా… కీలక నిర్ణయం తీసుకున్న బేగం బజార్‌ వ్యాపారులు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!