Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇంత మంది కూలీలు మృతి చెందడం బాధాకరం.. మోడీతో సహా ప్రముఖుల సంతాపం
రోడ్డు ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 40 మంది వరకు తీవ్రంగా..

రోడ్డు ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 30 (NH-30) పై మూడు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: ప్రధాని మోడీ
మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలి. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.




मध्य प्रदेश के रीवा में नेशनल हाइवे पर हुआ हादसा हृदयविदारक है। इसमें जिन्होंने अपनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है: PM Modi
— PMO India (@PMOIndia) October 22, 2022
ప్రయాణికుల మృతిపై చాలా బాధపడ్డాను: రాష్ట్రపతి
రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల మృతిపై చాలా బాధపడ్డానని ఆమె ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుండి గోరఖ్‌పూర్ బస్సు ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మృతి గురించి వినడం నాకు చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
हैदराबाद से गोरखपुर जा रही बस की रीवा, मध्यप्रदेश में हुई दुर्घटना से कई यात्रियों के निधन का समाचार सुनकर मुझे गहरा दुःख हुआ है। सभी शोक-संतप्त परिवारों के प्रति मैं गहरी संवेदना व्यक्त करती हूं। मैं घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करती हूं।
— President of India (@rashtrapatibhvn) October 22, 2022
గాయపడిన వారు త్వరగా కోలుకోలి: ఉపరాష్ట్రపతి
ప్రమాదం జరగడం చాలా బాధాకరమని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలు మరణించడం చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
Saddened by the loss of lives in a road accident in Rewa, Madhya Pradesh. My heartfelt condolences to the bereaved families and prayers for the speedy recovery of the injured.
— Vice President of India (@VPSecretariat) October 22, 2022
మృతదేహాన్ని ప్రయాగ్‌రాజ్‌కు పంపిస్తున్నాం: సీఎం శివరాజ్
ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. రేవాలో హైదరాబాద్ నుండి గోరఖ్‌పూర్ వెళ్తున్న ప్యాసింజర్ బస్సు ప్రమాదానికి గురికావడం బాధాకరమైన విషయం. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
रीवा में हैदराबाद से गोरखपुर जा रही यात्री बस के दुर्घटनाग्रस्त होने का दुःखद समाचार प्राप्त हुआ था। इस अत्यंत हृदय विदारक घटना में दिवंगत आत्माओं के प्रति मैं श्रद्धांजलि अर्पित करता हूं।
।। ॐ शांति ।।
मैं ईश्वर से घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 22, 2022
మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను అందజేస్తామని సీఎం యోగి ప్రకటించారు
మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతులు యూపీకి చెందిన వారు ఉండటంతో వారి మృతదేహాలను రాష్ట్రానికి తరలించడానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి