AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: గర్జిస్తున్న బుల్డోజర్లు.. ఈసారి ఏకంగా మాజీ సీఎం ఉమాభారతి సన్నిహితుడి ఫ్లాట్ల కూల్చివేత!

మధ్యప్రదేశ్‌లో బుల్డోజర్ చర్య నిరంతరం కొనసాగుతోంది. అక్రమ ఇళ్లు, ప్లాట్లను బుల్డోజర్లు ఆగకుండా ధ్వంసం చేస్తున్నాయి. అదే సమయంలో, ఈసారి సాత్నాలో అధికార పార్టీ చెందిన నాయకుడిని సైతం వదలలేదు.

Madhya Pradesh: గర్జిస్తున్న బుల్డోజర్లు.. ఈసారి ఏకంగా మాజీ సీఎం ఉమాభారతి సన్నిహితుడి ఫ్లాట్ల కూల్చివేత!
Madhya Pradesh Bulldozer
Balaraju Goud
|

Updated on: May 01, 2022 | 9:23 AM

Share

Madhya Pradesh Bulldozer Action: మధ్యప్రదేశ్‌లో బుల్డోజర్ చర్య నిరంతరం కొనసాగుతోంది. అక్రమ ఇళ్లు, ప్లాట్లను బుల్డోజర్లు ఆగకుండా ధ్వంసం చేస్తున్నాయి. అదే సమయంలో, ఈసారి సాత్నాలో అధికార పార్టీ చెందిన నాయకుడిని సైతం వదలడం లేదు. బీజేపీ మాజీ కార్యవర్గ సభ్యుడు మన్సుఖ్ పటేల్ సుమారు 10 ఎకరాలలో అక్రమంగా నిర్మించిన కట్టడంపై కూడా బుల్డోజర్ చర్య చేపట్టారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆక్రమణ స్క్వాడ్ ఈ అక్రమ ప్లాట్లను స్వాధీనం చేసుకుంది. ఈ అక్రమ ప్లాట్లలో మన్సుఖ్ పటేల్‌తో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల భాగస్వామ్యం కూడా ఉంది. ఇది 10 నుంచి 11 ఎకరాల ఆరాజీ అని మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణ స్క్వాడ్ ఇన్‌ఛార్జ్ రమాకాంత్ శుక్లా తెలిపారు.

మన్సుఖ్ పటేల్, ఇతర భాగస్వాములకు నోటీసు జారీ చేయడం జరిగింది. ఇందుకు వారు స్పందించకపోవడంతో.. కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. అందులో అక్రమంగా నిర్మించిన 3 ఇళ్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో రెండు ఇళ్లు విజయ్ మరార్కా పేరు మీద, ఒక ఇల్లు సంజయ్ తివారీ పేరిట ఉన్నాయి. 2 ఇళ్లు పూర్తి దెబ్బతిన్నాయి. మూడవది కూడా తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. 3 యంత్రాల ద్వారా దానిని కూల్చే పని జరుగుతోంది. అక్రమ కాలనీ, అక్రమ భవనాలు, ప్రభుత్వ భూమి ఏది కబ్జా చేసినా వాటిపై చర్యలు కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశాలు.

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న బుల్‌డోజర్ చర్య ఇప్పడప్పుడే తగ్గేలా లేదు. మన్సుఖ్ పటేల్ ఉమాభారతికి సన్నిహితుడిగా పేరుంది. ఇప్పటి వరకు వారి యాక్షన్ పై ఎలాంటి స్పందన రాలేదు. అదే సమయంలో, కొద్ది రోజుల క్రితం ఈ బుల్‌డోజర్ సీఎం సొంత జిల్లా సెహోర్‌లోని అష్టా వద్దకు కూడా చేరుకుంది. ఇక్కడ అలీపూర్ కాంగ్రెస్ నాయకుడు భయ్యా మియాన్ దుకాణాలు, 2 ఇళ్లను బుల్డోజర్‌తో అధికారులు ధ్వంసం చేశారు.

ఈ వ్యవహారం కాంగ్రెస్ నాయకుడికి, ముస్లిం వర్గానికి సంబంధించినది కావడంతో అక్కడికక్కడే స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌కు స్థానిక నేతలు సమాచారం అందించారు. దీని తర్వాత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ అక్కడికి చేరుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యేక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఇరువురు నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌, మాజీ మంత్రి అరుణ్‌ యాదవ్‌, స్థానిక కాంగ్రెస్‌ నేతలతో కలిసి కాలినడకన ఆ ప్రాంతంలో పర్యటించి స్థానిక పరిపాలన అధికారులు ఎస్‌డీఎం విజయ్‌ మండ్లోయ్‌, తహసీల్దార్‌ లఖన్‌సింగ్‌ చౌదరి, నాయబ్‌ తహసీల్దార్‌ అంకితా వాజ్‌పేయి, నాయబ్‌ తహసీల్దార్‌ అతుల్‌ శర్మ తదితరులతో కలిసి వివరాలు సేకరించారు. రెస్ట్ హౌస్‌లోని మూసి ఉన్న గదిలో సుమారు గంటపాటు చర్చించారు.

Read  Also…  Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంతంటే..

మరిన్ని జాతీయ వార్తల కోసం