అత్యాచార ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధురీదీక్షిత్
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనలను దేశయావత్తును కదిలించాయి.. రెండు వరుస గ్యాంప్ రేపు ఘటనలతో దేశం ఉలిక్కిపడింది.. హథ్రాస్ దారుణ సంఘటనపై దేశమంతటా నిరసనలు పెల్లుబుకుతున్నాయి..
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనలను దేశయావత్తును కదిలించాయి.. రెండు వరుస గ్యాంప్ రేపు ఘటనలతో దేశం ఉలిక్కిపడింది.. హథ్రాస్ దారుణ సంఘటనపై దేశమంతటా నిరసనలు పెల్లుబుకుతున్నాయి.. ఆందోళనలు జరుగుతున్నాయి.. విపక్షాలు మండిపడుతున్నాయి.. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాయి.. ఉత్తరప్రదేశ్‌లో ఇలా వెంటవెంటనే సామూహిక అత్యాచారాల సంఘటనలు జరగడంతో అసలు అక్కడ మహిళలకు భద్రత ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. ఈ సంఘటనలపై ఎంతో సెలెబ్రిటీలు గొంతు విప్పారు.. ఒకప్పటి బాలీవుడ్ క్వీన్ మాధురీ దీక్షిత్ కూడా చలించిపోయారు.. హథ్రాస్, బల్‌రాంపూర్ సంఘటనలు తనకు దిగ్భ్రాంతని కలిగించాయని ట్వీట్ చేశారు. బాధితుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు.. నేరం చేసినవారు ఎంతటివారైనా కఠినాతికఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికలు, అమ్మాయిలు, మహిళలపై ఇలాంటి దారుణ ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మాధురీ దీక్షిత్..