రూ. 800లకే ఏసీ… మీరూ చేసుకోవచ్చు!

రూ. 800లకే ఏసీ... మీరూ చేసుకోవచ్చు!

ఎండాకాలం వస్తే చాలు.. భీకరమైన ఎండలకు ప్రజలు అల్లాడిపోతుంటారు. ధనవంతులైతే ఏసీలు, కూలర్లు కొనుకుంటారు. కానీ మధ్య తరగతివారి పరిస్థితి వేరు. ఏసీ వారికి ఖరీదైన వ్యవహారమే. అయితే మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా గుజరాత్‌లోని వడొదరకు చెందిన చెందిన మనోజ్ పటేల్ అనే వ్యక్తి రూ. 800తోనే ఏసీ తయారు చేశాడు. మట్టిలోని అతిసూక్ష్మ రంధ్రాల గుండా వెళ్లే నీరు ఆవిరి కావడం చల్లదనానికి కారణమని అందరికి తెలిసిన విషయమే. సరిగ్గా అదే ఆలోచనతో […]

Ravi Kiran

|

Aug 26, 2019 | 1:17 PM

ఎండాకాలం వస్తే చాలు.. భీకరమైన ఎండలకు ప్రజలు అల్లాడిపోతుంటారు. ధనవంతులైతే ఏసీలు, కూలర్లు కొనుకుంటారు. కానీ మధ్య తరగతివారి పరిస్థితి వేరు. ఏసీ వారికి ఖరీదైన వ్యవహారమే. అయితే మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా గుజరాత్‌లోని వడొదరకు చెందిన చెందిన మనోజ్ పటేల్ అనే వ్యక్తి రూ. 800తోనే ఏసీ తయారు చేశాడు. మట్టిలోని అతిసూక్ష్మ రంధ్రాల గుండా వెళ్లే నీరు ఆవిరి కావడం చల్లదనానికి కారణమని అందరికి తెలిసిన విషయమే. సరిగ్గా అదే ఆలోచనతో మనోజ్ ఓ బుల్లి సైజ్ ఏసీని తయారు చేశాడు. అదీ కూడా మట్టికి బదులు పింగాణీని ఉపయోగించాడు.

మరోవైపు మనోజ్ మూడు రకాల ఏసీలను తయారు చేశాడు. ఇక ఈ ఏసీలు గది ఉష్ణోగ్రతలను 23 డిగ్రీల వరకు తీసుకురాగల సామర్ధ్యం ఉందని చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ ఏసీలకు కరెంటు అవసరం లేదని అన్నాడు. ఒక ఏసీకి పైన ట్యాంకుతో పాటు మొక్కను ఉంచగా.. మరోదానిపై ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. అటు ఈ ఏసీలలోని ట్యాంకును ఒకసారి నింపితే 10-12 రోజులు వరకు ఆ నీటిని వాడుకోవచ్చు. పింగాణీతో పాటు రాళ్లు, మట్టితో ఏసీలను అతి తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చని మనోజ్ తెలిపాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu