TRS – BRS: బీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు ఇవ్వని లోక్‌సభ సెక్రటేరియట్‌.. BAC భేటీకి ఆహ్వానితుడిగానే ఎంపీ నామ..

|

Mar 01, 2023 | 2:04 PM

బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ సెక్రటేరియట్‌ షాకిచ్చింది. బీఆర్‌ఎస్‌ను బీఎసీ ఇంకా గుర్తించలేదు. లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్రమే బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావును ఆహ్వానించారు.

TRS - BRS: బీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు ఇవ్వని లోక్‌సభ సెక్రటేరియట్‌.. BAC భేటీకి ఆహ్వానితుడిగానే ఎంపీ నామ..
Brs
Follow us on

బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ సెక్రటేరియట్‌ షాకిచ్చింది. బీఆర్‌ఎస్‌ను బీఎసీ ఇంకా గుర్తించలేదు. లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్రమే బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావును ఆహ్వానించారు. బీఏసీలో టీఆర్‌ఎస్‌ తరపున ఇప్పటివరకు బీఏసీ సభ్యుడిగా ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఉన్నారు. అయితే, ఇవాళ్టి బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) భేటీకి ఆహ్వానితుడిగానే నామ నాగేశ్వరరావుకు ఆహ్వానం అందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఇస్తారు. టీఆర్‌ఎస్‌కు లోక్‌ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్‌సభ సచివాలయం తొలగించింది. అయితే, లోక్‌ సభ బీఏసీలో ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్‌ఎస్‌ (బీఆర్ఎస్) కొనసాగనుంది. లోక్‌ సభ బీఏసీ ఇకపై ఆహ్వానం పంపితేనే టీఆర్ఎస్‌ బీఏసీ భేటీకి హాజరుకావాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే.., టీఆర్‌ఎస్‌ను ఇంకా బీఆర్ఎస్‌ (BRS) గా లోక్‌సభ సచివాలయం గుర్తించలేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ.. గత ఏడాది బీఆర్ఎస్‌గా మారింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ముగిసి.. బీఆర్ఎస్ ప్రస్థానం మెుదలైంది. అక్టోబర్ 5 వ తేదీన దసరా రోజున టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనౌన్స్ చేశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా ప్రకటించారు. అయినప్పటికీ.. లోక్ సభ సచివాలయం గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..