New Army Chief: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే.. తొలిసారి ఇంజినీర్‌కు భారత సైన్యం బాధ్యతలు..

భారత ఆర్మీ చీఫ్‌గా  లెఫ్టినెంట్ జనరల్​ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి.. పాండేను సైన్యాధిపతిగా ఎంపిక..

New Army Chief: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే.. తొలిసారి ఇంజినీర్‌కు భారత సైన్యం బాధ్యతలు..
Lieutenant General Manoj Pa
Follow us

|

Updated on: Apr 18, 2022 | 8:29 PM

భారత ఆర్మీ చీఫ్‌గా(New Army Chief)  లెఫ్టినెంట్ జనరల్​ మనోజ్ పాండే(General Manoj Pande) బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి.. పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్​ జనరల్ నరవాణే(General Manoj Mukund Naravane) ఏప్రిల్​ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్‌ పాండేను ఆయన వారసుడిగా కేంద్రం ఖరారు చేసింది. కార్ప్స్​ ఆఫ్​ ఇంజినీర్స్​ నుంచి ఆర్మీ చీఫ్​ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్​ కోసం పాండేతోపాటు జై సింగ్ నయన్, అమర్​దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లను కేంద్రం పరిశీలించింది. వీరిలో అత్యంత సీనియర్‌ అయిన పాండేకే బాధ్యతలను అప్పగించింది.

జనరల్ మనోజ్ పాండే గతంలో తూర్పు కమాండ్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అండమాన్, నికోబార్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్‌గా కూడా ఉన్నారు. జనరల్ మనోజ్ పాండే పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం అందుకున్నారు.

జనరల్ మనోజ్ పాండే ఆల్ ఇండియా రేడియోకు అనౌన్సర్, హోస్ట్‌గా పని చేసిన డాక్టర్ సీజీ పాండే, ప్రేమ దంపతులకు జన్మించారు. అతని కుటుంబం నాగ్‌పూర్‌కు చెందినది. స్కూలింగ్ తర్వాత జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. NDA తర్వాత, అతను ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరి.. చీఫ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతను 3 మే 1987న ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో గోల్డ్ మెడల్ దక్కించుకున్న అర్చన సల్పేకర్‌ను వివాహం చేసుకున్నారు.

జనరల్ మనోజ్ పాండే డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ రెజిమెంట్ అయిన బాంబే సాపర్స్‌లో నియమించబడ్డారు. అతను UKలోని క్యాంబర్లీలోని స్టాఫ్ కాలేజ్‌లో కూడా శిక్షణ తీసుకున్నారు. కోర్సు పూర్తయిన తర్వాత, అతను భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈశాన్య భారతదేశానికి చెందిన మౌంటైన్ బ్రిగేడ్‌కు బ్రిగేడ్ మేజర్‌గా నియమించబడ్డారు. అక్కడి నుంచి లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరుకున్న తరువాత, మనోజ్ పాండే.. ఇథియోపియా, ఎరిట్రియాలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు.

జనరల్ మనోజ్ పాండే జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై 117 ఇంజనీర్ రెజిమెంట్‌కు కూడా నాయకత్వం వహించారు. పరాక్రమ్ ఆపరేషన్ సమయంలో పార్ రెజిమెంట్ కమాండర్‌గా ఉన్నారు. దీని తర్వాత మనోజ్ పాండే మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో చేరారు. హయ్యర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు. ఆ తర్వాత, హెడ్‌క్వార్టర్స్ 8 మౌంటైన్ డివిజన్‌లో కల్నల్ క్యూగా నియమించబడ్డారు.

మేజర్ జనరల్ స్థాయికి పదోన్నతి పొందిన తరువాత.. పశ్చిమ లడఖ్‌లో అత్యంత ఎత్తైన ప్రాంతంలో పనిచేసే 8వ మౌంటైన్ విభాగానికి కమాండర్‌ వహించారు. ఆ తర్వాత ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ADG)గా పనిచేశారు. లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి పదోన్నతి పొంది.. అతను సదరన్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతను స్వీకరించారు.

ఇవి కూడా చదవండి: Stock Market: రూ. 2.56 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరి.. భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ షేర్లు..

Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..

Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..