Leopard Attack: జనావాసాల్లో చిరుత పులి కలకలం.. బహిర్బుమికి వెళ్లిన బాలికపై దాడి..!

ఉత్తరాఖండ్‌ లోని జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ నుంచి ఓ చిరుతపులి బయటకు వచ్చింది. జనావాసాల్లోకి పులి రావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా మరోసారి చిరుతపులి మరోసారి బీభత్సవం సృష్టించింది. ఇంటి ముందు ఉండే పెంపుడు జంతువులను సైతం వదలడం లేదు. రోజురోజుకు చిరుతపులి దాడులతో స్థానికులు గాయపడుతున్నారు

Leopard Attack: జనావాసాల్లో చిరుత పులి కలకలం.. బహిర్బుమికి వెళ్లిన బాలికపై దాడి..!
Leopard
Follow us

|

Updated on: Aug 01, 2024 | 5:33 PM

ఉత్తరాఖండ్‌ లోని జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ నుంచి ఓ చిరుతపులి బయటకు వచ్చింది. జనావాసాల్లోకి పులి రావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా మరోసారి చిరుతపులి మరోసారి బీభత్సవం సృష్టించింది. ఇంటి ముందు ఉండే పెంపుడు జంతువులను సైతం వదలడం లేదు. రోజురోజుకు చిరుతపులి దాడులతో స్థానికులు గాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలు, మొబైల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

తాజాగా ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో 13ఏళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. బాజ్‌పూర్ పరిధిలోని గోబర్ జ్వాలవన్‌లో నివాసం ఉంటున్న దర్శన్ సింగ్ కుమార్తె సందీప్ కౌర్ (13) చిరుత దాడి చేసింది. అర్థరాత్రి తమ ఇంటికి కొంత దూరంలో ఉన్న పొలాల్లో మలవిసర్జన చేసేందుకు వెళ్లారు. ఇంతలో చిరుతపులి సందీప్‌ కౌర్‌ తలపై దాడి చేయడంతో రక్తస్రావమైంది. తీవ్రంగా గాయపడ్డ సందీప్‌కౌర్‌ అపస్మారకస్థితి వెళ్లింది.

ఈ ఘటనతో బాలిక అరుపులు విని ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. గాయపడిన ఆమెను బాజ్‌పూర్ సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ వైద్యుల బృందం, ప్రథమ చికిత్స అందించిన తర్వాత, సందీప్ కౌర్‌ను ఉన్నత వైద్య కేంద్రానికి రెఫర్ చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అటవీశాఖపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రాత్రి పెట్రోలింగ్‌లో అటవీశాఖ బృందాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అటవీశాఖ డీఎఫ్‌వో ఉమేష్ చంద్ర తివారీ తెలిపారు. అయితే చిరుతపులి ఆచూకీ లభించలేదు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే చిరుతను పట్టుకుని అడవుల్లోకి వదులుతామని తెలిపారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

బాజ్‌పూర్‌లోని న్యూ సూద్ కాలనీకి సమీపంలో ఉన్న శిథిలాలలో చిరుతపులి చాలాసార్లు కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతపులి దాడి చేయడంతో స్థానికుల్లో భయానక వాతావరణం నెలకొంది. సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో చిరుతపులి చిత్రాలు చాలాసార్లు రికార్డ్ అయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..