సైబర్ సెక్యూరిటీ విషయంలో వెనక్కు తగ్గేది లేదని, ఇంటర్నెట్ యూజర్ల వ్యక్తిగత గోప్యతను కాపాడడమే లక్ష్యంగా త్వరలోనే డేటా ప్రొటెక్షన్ బిల్లును అమల్లోకి తెస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) తెలిపారు. భారతదేశంలో విశ్వసనీయమైన, సురక్షితమైన ఇంటర్నెట్‌ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ బుధవారం (మే18) విలేకరుల సమావేశం నిర్వహించింది. దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT), స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ ఆదేశాలపై తరచుగా అడిగే ప్రశ్నల (FAQలు) పత్రాన్ని కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ..సైబర్ సెక్యూరిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా క్లిష్టమైన సమస్యగా మారిందన్నారు. కాబట్టి మనం ఇంటర్నెట్ సురక్షితంగా ఉండేలా చూసుకోలని సూచించారు.
180 రోజుల డేటాబేస్ ను..
‘డిజిటల్ ఎకానమీ పెరుగుతున్న కొద్దీ అవకాశాలు పెరుగుతాయి. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అలాగే మౌలిక సదుపాయాల కోసం 2019-20లో 809 కోట్లు, 2022-23లో 550 కోట్లు ఖర్చు చేసింది. ఇక సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించేందుకు రూ.100 కోట్లు వెచ్చించాం. ఇప్పటివరకు 1,360 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని.. 2,50,000 మంది ఈ అవగామన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతదేశంలో విశ్వసనీయమైన, సురక్షితమైన ఇంటర్నెట్‌ను అందించడమే మా లక్ష్యం. ఈ-కామర్స్ కంపెనీలు, బ్యాంకులు తదితర సంస్థలు కూడా ఇంటర్నెట్ విషయంలో వినియోగదారులకు భరోసా ఇవ్వాలి. వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదు. ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన రూల్స్ అన్నీ ఇండస్ట్రీల వారితో చర్చించి తయారు చేశామని, వాటిని పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏవైనా సైబర్ నేరాలు జరిగినా 6 గంటల్లోగా రిపోర్టు చేయాలి. అన్ని కంపెనీలు తమ డేటాబేస్‌ను 180 రోజుల పాటు సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయి. ‘
త్వరలోనే డేటా రక్షణ బిల్లు..
‘వ్యక్తిగత వినియోగదారుల గోప్యతను రక్షించే లక్ష్యంతో త్వరలోనే డేటా ప్రొటెక్షన్ బిల్లును అమల్లోకి తెస్తున్నాం. దీని ప్రకారం ఎక్కడెక్కడ సైబర్ భద్రతా ఉల్లంఘనలు జరుగుతున్నాయో సమీక్షిస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. డేటా రక్షణ చట్టం పౌరుల హక్కులతో పాటు గోప్యతను కాపాడుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇలాంటి మరిన్ని నియమాలు, మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. వాటిని పాటించేందుకు 60 రోజుల సమయం ఇచ్చాం. 2011- 2022 మధ్య చాలా వ్యత్యాసం ఉంది . ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ మేరకు ఐటీ చట్టంలో కూడా మార్పులు తీసుకొస్తాం’ అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.
.@IndianCERT releases FAQs to address queries on Cyber Security Directions of 28.04.2022
Recently issued Cyber Security directions are just one piece in the overall Cyber Security Architecture: MoS @Rajeev_GoI
Read: https://t.co/TxD2aJr6Qt pic.twitter.com/lyPb7BSrWx
— PIB India (@PIB_India) May 18, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: