Kumki Elephant: ఏనుగులందు కుంకీ ఏనుగులు వేరయా! ఇంతకీ వీటి ప్రత్యేకత ఏమిటి? వీటికిచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది?
కుంకీగా ఒక ఏనుగును సెలక్ట్ చేయడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. అన్ని ఏనుగులను కుంకీలుగా మార్చడం చాలా కష్టం. అయితే.. అన్ని రకాల ఏనుగులను అదుపు చేసే శక్తి.. మగ ఏనుగులకు ఉంటుంది. అందుకే.. కుంకీలుగా మగ ఏనుగులను మాత్రమే సెలక్ట్ చేస్తారు. దీనికీ ఓ కారణం ఉంది.

ఏనుగమ్మా ఏనుగు మా వూరొచ్చే ఏనుగు అని చిన్నప్పుడు చాలామంది పాట పాడుకుని ఉండొచ్చు. కానీ కొన్ని ఊళ్లు మాత్రం.. అటవీ ఏనుగులను తమ ఊరికి రావద్దనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే అవి చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. పంటలను పాడుచేస్తాయి. అడ్డొచ్చే వారిని చంపేస్తాయి. ఊళ్లను ధ్వంసం చేస్తాయి. దీంతో ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే ఆందోళన చెందుతారు. ఎందుకంటే.. వాటి వల్ల జరిగే నష్టం.. వచ్చే కష్టం సంగతి వాళ్లకు తెలుసు. అందుకే.. ఏపీ సర్కారు కూడా కుంకీ ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇంతకీ ఈ కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి? అడవి ఏనుగులను అవి ఎలా దారికి తెస్తాయి? అసలు వాటి స్పెషల్ ఏమిటి? Kumki Elephant 1 కుంకీ ఏనుగులు వస్తే.. అడవి ఏనుగుల బాధ తగ్గుతుంది. జనావాసాల్లోకి వీటి రాకను అడ్డుకోవడానికి వీలుపడుతుంది. కొన్నేళ్లుగా వీటితో పడ్డ సమస్యలు తొలగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంది. ఇంతకీ కుంకీ ఏనుగులు నిజంగానే అంత ప్రత్యేకమైనవా? అవును ఇవి నిజంగానే స్పెషల్. కుంకీ ఏనుగులంటే.. మావటిలు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులు. అడవి ఏనుగులను ఎలా తరిమేయాలో.. వాటిని ఎలా మచ్చిక చేసుకుని అడవిలోకి పంపించాలో.. ఆగ్రహంతో ఉన్న గజరాజులను...