Kolkata Doctor Case: ట్రైనీ డార్టర్‌ హత్యాచార కేసు.. దాడికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాల్లో నిందితుడి సంచారం

|

Aug 21, 2024 | 11:59 AM

దేశ వ్యాప్తంగా దుమారం లేపిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార కేసులో రోజుకో సంచలనం బయటకు వస్తుంది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 8న 31 యేళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ కేసులో నిందితుడికి సంబంధించి మరొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌ నేరం జరిగిన రోజు రాత్రి కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు..

Kolkata Doctor Case: ట్రైనీ డార్టర్‌ హత్యాచార కేసు.. దాడికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాల్లో నిందితుడి సంచారం
Kolkata Doctor Case
Follow us on

కోల్‌కతా, ఆగస్టు 21: దేశ వ్యాప్తంగా దుమారం లేపిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార కేసులో రోజుకో సంచలనం బయటకు వస్తుంది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 8న 31 యేళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ కేసులో నిందితుడికి సంబంధించి మరొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌ నేరం జరిగిన రోజు రాత్రి కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య నాలుగు సార్లు ఆసుపత్రిని సందర్శించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అసలా రోజు ఏం జరిగిందంటే..

సంజయ్ రాయ్ ఆగస్టు 8న అప్పటికే ఫూటుగా మద్యం సేవించి ఉన్నాడు. అనంతరం ఆసుపత్రికి చెందిన మరో సివిక్‌ వాలంటీర్‌తో కలిసి అద్దెకు తీసుకున్న ద్విచక్ర వాహనంపై సోనార్‌గాచ్‌లోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు. అక్కడ ఓ వ్యభిచార గృహం బయట ఉండగా.. అతడితోపాటు వచ్చిన మరో వ్యక్తి లోపలికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో చెట్లాలోని మరో రెడ్ లైట్ ఏరియాకి వెళ్లారు. చెట్ల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్లే దారిలో కొంతమంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆర్జీ కర్ ఆసుపత్రికి వచ్చాడు. ట్రామా సెంటర్ వెలుపలకు వెళ్లిన అతడు కొంత సమయం తరువాత ఎమర్జెన్సీ వార్డులోపలికి వెళ్లాడు. అనంతరం మూడో అంతస్తులోని సెమినార్‌ హాల్‌ గదిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న బాధితురాలు గాఢ నిద్రలో ఉండగా.. ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి బయలుదేరి సాల్ట్ లేక్‌లోని పోలీసు బ్యారక్‌కి వెళ్లాడు. ఆగస్టు 9న 10.53 నిమిషాలకు ఆస్పత్రి వర్గాలు బాధితురాలి తల్లికి సమాచారం అందించారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పి, ఆ తర్వాత అది హత్యగా తేల్చారు. బాధితురాలు చనిపోయిన సెమినార్‌ హాల్‌లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దిగ్భ్రాంతికర సంఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత అంటే ఆగస్టు 14న కలకత్తా హైకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. విచారణ చేపట్టిన సీబీఐ తొలుత ఆస్పత్రిలోని సీసీటీవి ఫుటేజీని స్వాధీనం చేసుకుంది. ఆగస్టు 20న సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ కేసులో సుమోటోగా చర్య తీసుకుంది. మీడియాలో ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోగ్రాఫ్‌లు, వీడియో క్లిప్‌లను పోస్టు చేయవద్దని, అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంలలో వాటిని తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నేరాన్ని ఆత్మహత్యగా మార్చడానికి ఆస్పత్రి ప్రిన్సిపాల్ చేసిన ప్రయత్నాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయనను బదిలీ చేయడంతో ఈ కేసు రాజకీయంగా మలుపు తిరిగింది . కోర్టు జోక్యంపై అతడిని దీర్ఘకాల సెలవుపై పంపారు. ఈ కేసు సాక్ష్యాధారాల పవిత్రత, శాంతిభద్రతలు, అలాగే ఆసుపత్రుల వంటి ప్రదేశాలలో వారి కార్యాలయంలో మహిళల భద్రతతో సహా పలు సమస్యలు హైలైట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.